థియేటర్ల బంద్ పై జ‌న‌సేన షాకింగ్ డెసిష‌న్‌.. పవన్ కీలక ప్రకటన వైరల్..!

గ‌త‌కొద్ది రోజులుగా థియేటర్ల బంద్‌ వివాదం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపి డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు. రాష్ట్రంలో థియేటర్ల నిర్వహణకు పగడ్బందీగా ప్లాన్లు చేపట్టాలని.. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించే దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని క్లారిటీ ఇచ్చాడు. ఇక రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.. థియేటర్ల బంద్ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా చేపట్టిన చర్యలు, తాజా పరిణామాలను డిప్యూటీ సీఎంకు క్లియర్ కట్గా వెల్లడించాడు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక ఆదేశాలను జారీ చేశాడు. టికెట్ ధరల పెంపు కావచ్చు.. హ‌ళ్ళ‌ నిర్వహణ విషయం కావచ్చు.. మరేదైనా విషయమైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను.. పర్యవేక్షణను.. పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలని.. త్వరలో రిలీజ్ అయ్యే.. హరిహర వీరమల్లు కు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు కాదు.. సినీ ఇండస్ట్రీ, వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలని సంప్రదింపులు చేయాలని ఇందులో తన మన భేదాలు అస్సలు వద్దంటూ క్లారిటీ ఇచ్చాడు. టికెట్ ధరలకంటే హాల్లో ఉండే తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ళ సీసాలు కూడా భారీగా ధర ఉంటున్నాయని అంశాన్ని చర్చించారు.

వాస్తవంగా వాటి ధ‌రలు ఎంత.. ఎంతకి కొంటున్నారు.. అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏంటి.. సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని.. ధ‌ర‌ల నియంత్రణ కూడా చేపట్టాలని పవన్ వెల్లడించాడు. రాష్ట్రంవ్యాప్తంగా మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ లో ఆహార పదార్థాలు, శీతలపానీయాల వ్యాపారంలోనూ గుప్తాధిపత్యం సాగుతోందన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని.. దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని ఆదేశించాడు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా హాల్ కు వెళ్లాలంటే.. వీటన్నింటి ధరలు చూసి వెనుకడుగు వేసే పరిస్థితి ఉండకూడదని.. పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరలు తగ్గితే ప్రేక్షకులు సంఖ్య పెరుగుతుందని.. తద్వారా పన్ను ఆదాయం కూడా కచ్చితంగా పెరుగుతుందంటూ వెల్లడించాడు.

Pawan Kalyan Responds to Criticism over Celebrities' Silence on Terror Attacks and Operation Sindoor - RTV English

ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలని.. థియేటర్లలో తాగునీరు, పారిశుధ్య నిర్వహణ లో ఓనర్లు కనీస బాధ్యత పాటించాలని.. వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకోవాలని వెల్లడించాడు. ఇక తెలుగు సినిమా ధియేటర్ల బంద్ ప్రకటనకు వెనుక.. ఉన్నది ఆ నలుగురు ప్రొడ్యూసర్ లే.. అంటూ వస్తున్న వార్తలపై తమకు సంబంధం లేదని ఇద్ద‌రు నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. కాగా.. తూర్పుగోదావరి జిల్లాలోనే మొదట ఈ థియేటర్ల బంద్ ప్రకటన వెలువడటంతో ఇతర అంశాలన్నీ చర్చకు దారితీసాయి. బంధ్‌ చేపట్టిన నేప‌ద్యంలో విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెల్లడించాడు.

కాగా ఈ ఇబ్బందుల‌కు దారి తీసిన‌ది జనసేన నాయకుడే అంటూ ఓ నిర్మాత మీడియా ముందు వివరించిన సంగతి తెలిసిందే. ఒక సినీ నిర్మాత, హాల్‌లు కలిగిన ఒక రాజకీయ నాయకుడు ప్రమేయం ఉంద‌ని టాక్ నడుస్తున్న నేపథ్యంలో.. ఈ కోణంలో కూడా విచారణ చేపట్టాలని.. పవన్ సినిమాటోగ్రఫీ మంత్రికి ఆదేశించాడు. రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనుక గల కారణాలు తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు.

ఇక ఈ సంఘటనకు కారకులు జనసేన వాళ్ళైనా సరే సరైన చర్యలు తీసుకోవాలని.. నిర్మాతలను కావచ్చు, నటీనటులను కావచ్చు, దర్శకులను కావచ్చు.. ఎవరినైనా బెదిరించి దారికి తెచ్చుకోవాలని.. వ్యాపారాన్ని సాగించాలని.. అనారోగ్య వాతావరణానికి అసలు దారి ఇవ్వకుండా.. ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని చెప్పుకొచ్చారు. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలికి.. నిర్మాత మండలికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దర్శకుల సంఘాలకు.. ఈ విషయాన్ని క్లియర్గా తెలియజేయాలని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకు రాదలచిన కాన్ఫరెన్స్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో.. రంగా అభివృద్ధికి సూచనలను కూడా.. తెలుగురంగంలోని సంఘాలు, మండలిల‌ నుంచే స్వీకరించాలని పవన్ క్లారిటీ ఇచ్చాడు.