టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో తన నటనతో సత్తా చాటుకున్న తారక్.. దేవరతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వనన్నాడు. హృతిక్ రోషన్.. మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటించనున్నాడు. తర్వాత దేవర సీక్వెల్ ఎలాగు లైన్లో ఉంది.
అంతేకాదు.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్లు స్వయంగా తారక్ వెల్లడించాడు. ఇలా.. చేతినిండా సినిమాలతో డేట్లు ఖాళీ లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న తారక్.. గతంలో ఎన్నో ఇండస్ట్రియల్ హిట్ సినిమాలను వదులుకున్నాడంటూ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. అయితే.. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన.. డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఇతర సినిమాలో షూటింగ్లలో బిజీగా ఉండడం, కథ నచ్చక నో చెప్పడం.. ఇలా రకరకాల కారణాలతో కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సినిమాలే తర్వాత బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి.
అలా గతంలో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఇండస్ట్రియల్ హిట్ సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన కిక్, అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య, నితిన్ హీరోగా వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన దిల్, బోయపాటి.. భద్ర, నాగార్జున.. ఊపిరి, కళ్యాణ్ రామ్.. అతనొక్కడే, ఎవడు, కృష్ణ ఈ హిట్ సినిమాల అన్నింటిలో మొదట ఎన్టీఆర్ నే భావించారట మేకర్స్. కానీ.. తారక్ వాటిని ఏవో కారణాలతో రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కాగా తారక్.. కెరీర్‌లో రిజెక్ట్ చేసిన ఈ ఇండస్ట్రియల్ హిట్ సినిమాలు అన్నింటిలోనూ ఆయన నటించి ఉంటే.. ఇమేజ్ మరింత పెరిగేది అనడంలో సందేహం లేదు.