టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అక్కినేని నాగార్జున రెండో నటవారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్ కెరీర్‌లో ఒక్కసరైనా హిట్ కూడా పడకున్నా అభిమానించే ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ పై ఇప్పటికే ఫ్యాన్స్‌లో మంచి నమ్మకాలు నెలకొన్నాయి. అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలన్నీ టాలీవుడ్ టాప్ బ్యానర్ మూవీస్ కావడం విశేషం.
ఇక అఖిల్ పర్సనల్ విషయానికి వస్తే గతేడాది నవంబర్ 26న అఖిల్ జైనబ్ రావిడ్జ్‌తో నిశ్చితార్థ వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కినేని ఇంట పెళ్లి భాజలు ఎప్పుడు మోగుతాయి.. అఖిల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నలు నెటింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఎట్టకేలకు ఆ ముహుర్తం రానే బచ్చేసిందట. జూన్ 6న అఖిల్, జైనబ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారట. ఇక పెళ్లికి పది రోజులు మాత్రమే సమయం ఉండడంతో.. ఈ పనుల్లో అక్కినేని ఫ్యామిలీ బిజీగా గడుపుతున్నారు.
మరి ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి. ఇక అఖిల్ పెళ్లాడబోయే జైనబ్ నటి. అలాగే ప్రముఖ వ్యాపారవేత జుల్ఫీ రావిడ్జ్ కూతురు కావడం విశేషం. పెళ్లి తర్వాత అయినా అఖిల్ కెరీర్ పరంగా కలిసి వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వస్తే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే. చైతన్య, శోభితల పెళ్లి గతేడాది చివర్లో జరగగా ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొన్ని నెలల గ్యాప్ లోనే అక్కినేని ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగనుండడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.