టాలీవుడ్ యంగ్ హీరో సిద్ద జొన్నలగడ్డ.. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ భాస్కర్ సక్సెస్‌లు అందుకొని స్టార్ బాయ్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా సిద్ద జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ జాక్ కొంచెం క్రాక్. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో హైప్ పెంచేందుకు టీం చాలా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇక ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేయడంలో సిద్దు జొన్నలగడ్డ టిపికల్ స్టైల్ అనుసరిస్తూ ఉంటాడు. టిల్లు పాత్రలో ఆయన నటన, కామెడీ టైమింగ్స్ ఆకట్టుకోవడమే కాదు.. ఆడియన్స్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది.
ఇక జాక్ టీజర్ చూస్తే టిల్లు కామెడీ టైమింగ్స్ గుర్తుకొచ్చాయి. కాగా.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో కామెడీ మాత్రమే కాదు.. అంతకుమించి అనేలా కథలో ఆసక్తిని రేకెత్తించే కట్స్‌ను రిలీజ్ చేశారు టీం. జాక్ కొంచెం క్రాక్‌తో.. సిద్ధు పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా ఆకట్టుకొనున్నాడని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. ఇక తన కొడుకు ఏం కావాలని భావిస్తున్నాడో తెలుసుకోవాలని ఆరాటపడే తండ్రిగా సీనియర్ యాక్టర్ నరేష్ టీజర్ వరకు ఆకట్టుకోగా.. ట్రైలర్లో సిద్దు ఒక స్పై ఏజెంట్ రేంజ్ లో మెరిసాడు.
ఇక యాక్షన్ సీన్స్ మరింతగా ఆకట్టుకుంటున్నాయి. వైష్ణవి చైతన్యతో ఆయన కెమిస్ట్రీ అదిరిపోతుందనే ఫీల్ ట్రైలర్లో చూస్తే కలుగుతుంది. ఇద్దరి మధ్య సీన్స్ మెప్పించేలా ఉన్నాయి. సినిమాలో యాక్షన్ ఒకటే కాదు.. కామెడీ తో పాటు.. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, లవ్ స్టోరీ కూడా హైలెట్ కానుందని టైలర్ తో క్లారిటీ ఇచ్చారు టీం. ఇక సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా రిలీజైన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.