టాలీవుడ్ దివంగత నటుడు.. సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం హీరోగానే కాదు.. దర్శకుడుగా, ప్రొడ్యూసర్ గా అన్ని విధాల సత్తా చాటుకున్న కృష్ణ.. ఓ విధంగా చెప్పాలంటే నిర్మాతల పాలిట దేవుడిగా మారాడు. బోళా శంకరుడుగా ప్రశంసలు అందుకున్నాడు. అంతే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త ఒరవడిని పరిచయం చేసిన నటుడుగాను ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీకి కౌబాయ్ పాత్రను పరిచయం చేసింది కృష్ణ అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి కృష్ణ.. కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి కారణం మహేష్ బాబు అంటూ తాజాగా కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.
ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1995 నుంచి కృష్ణ ఇంట్లో వేణు స్వామి పూజలు నిర్వహిస్తూ ఉండేవాడినని.. వారి జాతకాలను కూడా చూసి చెప్పేవాడిని.. ఏ విషయం అయినా ముక్కుసూటిగా చెబుతున్న క్రమంలోనే విజయనిర్మలతో 2020 నుంచి మీ కుటుంబంలో మరణాలు సంభవిస్తాయని చెప్పా. దీంతో వారి కుటుంబం భయపడి పోయి నాతో జాతకాలు చెప్పించుకోవడమే మానేశారు. కానీ నేను చెప్పినట్లుగానే 2020 తర్వాత మరణాలు మొదలయ్యాయి అంటూ వివరించాడు. అంతేకాదు మహేష్ బాబు గ్రహస్థితి గురించి కూడా వాళ్లకు తెలియజేశా.
ఆయన సింహరాశి కావడంతో 2020 నుంచి గ్రహాల మార్పు ఆయన కుటుంబం పై ప్రభావం చూపిస్తుందని.. జనవరి 16 తర్వాత మహేష్ బాబు.. తల్లితండ్రి జీవితాల్లో ఒక అనర్ధం జరగబోతుందని నేను గ్రహించా అంటూ.. కృష్ణ మృతికి మహేష్ బాబు గ్రహ ప్రభావమే కారణమని చెప్పకనే చెప్పాడు. అయితే ఈ విషయాన్ని నేను నా సొంతంగా చెప్పలేదు.. వారి జాతకచక్రాన్ని చూసి గ్రహాలను అనుసరించే చెప్పా అంటూ వివరించాడు. మహేష్ బాబు గ్రహ స్థితి వల్లే తన తండ్రి మరణించాడు అని అనడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ వేణు స్వామి పై మండిపడుతున్నారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తూ బండబూతులు తిడుతున్నారు. అసలు ఆ నోటికి ఏం వాగుతున్నావో అర్థమవుతుందా.. ఏదో వస్తే అది మాట్లాడేస్తావా.. అసలు నువ్వే జనానికి పట్టిన పెద్ద సమస్య అంటూ వేణు స్వామి పై ఫైర్ అవుతున్నారు.