సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో ఎదిగిన వారే. కనీసం తినడానికి తిండి కూడా లేక రోడ్లపై తిరుగుతూ.. కష్టపడి ఇప్పుడు స్టార్ సెలబ్రెటీల్ గా మారి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నవారు ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న నటుడు కూడా ఒకరు. 18 ఏళ్లకే తల్లిదండ్రులన్ని కోల్పోయాడు. మొదట తండ్రి క్యాన్సర్‌తో కనుముయగా.. తర్వాత రెండేళ్లకు తల్లి మూత్రపిండాల సమస్యతో మరణించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన ఆయనకు చట్టపరమైన ఇబ్బందులతో సొంతిల్లు కూడా పోయింది.
దీంతో పూర్తిగా రోడ్డున పడ్డ అతను చేతనైన పని చేస్తూ.. దొరికింది తింటూ.. కడుపు నింపుకునేవాడు. అలా గతంలో బస్సులో లిప్స్టిక్స్, నేయిల్పాలిష్‌లు అమ్ముకున్న ఈ వ్యక్తి.. తర్వాత ఫోటో ల్యాబ్ లో పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే సీనియర్ డైరెక్టర్ మహేష్ భట్‌కు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. తర్వాత ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ నటుడిగా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. కోట్లాదిపతిగా రానిస్తున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు.. ప్రభాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి నెట్టింట వైరల్ గా మారిన అర్షద్ వార్సీ.
అర్షద్ సినిమాల్లోకి రాకముందు కడుపు నింపుకోవడానికి ఎన్నో పనులు చేసేవాడట. అందులో భాగంగానే బోరవెల్లి – బాంద్రా బస్సులో నెయిల్‌పాలిష్‌లు – లిప్స్టిక్లు అమ్ముకున్నాడట. అతనికి మొదటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. దీంతో అక్బర్ సమీ డ్యాన్స్ టీమ్ లో చేరిన ఆయన.. తర్వాత కొరియోగ్రాఫర్ గా మారాడు. ఆ తర్వాత తేరే మేరే సప్నే తో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తర్వాత నుంచి ఆయన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోతున్నాడు.