పుష్పరాజ్ పేరు వెనుక ఇంత స్టోరీ నడిచిందా.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివిల్..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. పుష్ప ది రూల్స్ ఇన్ మాతో సాలిడ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ అవార్డు ఈవెంట్ లో సందడి చేశాడు. ఇందులో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో తన పేరు విని చాలామంది తమిళనాడు వాసనని భావించారని.. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా అలా అనుకుని నాతో మొదట్లో తమిళ్ లో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాల్లో అల్లు అర్జున్ పేరు పుష్ప రాజ్‌ ఎంత హైలెట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్ర‌మంలోనే సినిమాలో హీరోకు పుష్పరాజ్ రోల్ పెట్టడంపై సుకుమార్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. సుకుమార్ మాట్లాడుతూ.. నేను కెరీర్ ప్రారంభించిన రోజుల్లో ఇండస్ట్రీ చెన్నైలో ఉండేదని.. ఎడిటర్ మొహద్ద్‌ వద్ద అసిస్టెంట్ గా పనిచేశా అంటూ చెప్పుకొచ్చాడు. ఆర్య తిస్తున్న సమయంలో నా పేరు విని చాలామంది తమిళనాడు వ్యక్తిని అనుకున్నారని.. ఎందుకంటే సుకుమార్ అనే పేరు తెలుగులో చాలా అరుదుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నన్ను ఎవరు కలిసిన తమిళ్ లోనే మాట్లాడేవాళ్లు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక పుష్ప 2 సక్సెస్ అందుకున్న తర్వాత కూడా.. టాలీవుడ్ సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణగారు ఫోన్ చేసి నాతో తమిళ్ లోనే మాట్లాడారని.. నువ్వు తమిళ్ వాడివి కాదా అని ఆశ్చర్యపోయారు అంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు. మణిరత్నం గీతాంజలి సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గా మారాలని నేను నిర్ణయించుకున్నా. డైరెక్టర్గా మారడానికి నాలో స్ఫూర్తి నింపినందుకు ఆయనకు ఈ వేదికపై ధన్యవాదాలు తెలుపుతున్న అంటూ చెప్పుకోచ్చాడు సుకుమార్. తర్వాత మనదేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్న క్రమంలో.. మొదట ఈ అంశంపై వెబ్ సిరీస్ తీయాలని భావించా.

అందుకోసం ఎంతోమంది స్మ‌గ్లర్ల‌ని కలిసి ఇంటర్వ్యూలు చేశా. పలు విషయాల గురించి వారితో మాట్లాడాను కూడా. ఈ క్రమంలోనే నేను ఒక స్మగ్లర్ను కలిసా అతని పేరు పుష్పరాజ్. మిగిలిన వాళ్ళు అంతా అతని పుష్పా అని పిలిచేవారు. ఇక ఈ పేరైతేనే హీరోకి బాగుంటుంది.. ఇండియా మొత్తానికి కనెక్ట్ అవుతుందని ఆలోచన నాకు కలిగింది. అలా హీరోకు పుష్పారాజ అనే పేరు పెట్టా అంటూ సుకుమార్ వివరించాడు. ప్రస్తుతం సుకుమార్ కామెంట్స్ నెటింట‌ వైరల్ అవడంతో.. వామ్మో బన్నీ పాత్ర నేమ్ వెనుక కూడా ఇంతగా సుకుమార్ కసరతుల చేశారా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.