అఖండ 2: మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. అఘోరా నుంచి రియల్ బాలయ్య లుక్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్లో.. ప్రస్తుతం అఖండ  తాండవం న‌టిస్తున్న‌ సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి.. సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పటికప్పుడు నెటింట‌ వైరల్‌గా మారుతూనే ఉంది. అయితే.. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. టీం కూడా సినిమాను డిజైన్ చేస్తున్నారని సమాచారం. షూట్ ప్రారంభమైన దగ్గర నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న టీం.. ఇప్పటికే ప్రయాగరాజ్ కుంభమేళా లాంటి ఎక్జాటిక్ లొకేషన్ లలో సైతం కీలక షూట్లో పూర్తి చేసుకున్నారు.

The secret behind Balakrishhna's Aghora avatar | cinejosh.com

ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ లో మెర‌వ‌నున్నాడు. అఖండలో హైలైట్ అయిన అఘోర పాత్ర.. అసలు విశ్వరూపాన్ని రెండో భాగంలో చూపించనున్నారు టీం. ఇందులో భాగంగానే కుంభమేళాలో రూపొందించిన అఘోర సీన్స్ అన్ని సినిమాకు హైలైట్ గా మారనున్నాయని యూనిట్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొ అప్డేట్ వైరల్ గా మారింది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి బాలయ్య పై కేవలం అన్ని అఘోర రోల్ కు సంబంధించిన సీన్స్‌ని షూట్ చేస్తూ వచ్చారట. తాజాగా హీరోలకు సంబంధించిన టాకీ అంతా ముగిసినట్లు తెలుస్తుంది.

BB3 titled as 'Akhanda': Balakrishna roars as Aghori in Ugadi teaser |  Telugu Movie News - Times of India

నెక్స్ట్ షెడ్యూల్‌లో బాలయ్య సెకండ్ రోల్ కు సంబంధించిన షూట్ ను మొదలుపెట్టనున్నారని సమాచారం. ఇక ఈ రోల్ కు సంబంధించిన ఎక్కువ భాగం షూట్ హైదరాబాదులోనే జరుగుతుందట. ఈ రోల్ అవుట్‌డోర్ షూటింగ్ పెద్దగా ఉండదని.. అవసరమైన వ‌ర‌కు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ మాత్రమే పూర్తి చేస్తారని సమాచారం. అయితే మూవీ టాకీ ఎంతవరకు పూర్తయింది.. అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక షూట్ మొత్తం జూన్ నెలకరుకి పూర్తి చేసి.. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని భావిస్తున్నారట. ఇప్పటికే సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్న‌ట్లు అనౌన్స్ చేసిన టీం.. అందుకు అనుకూలంగా షూటింగ్ ప్లాన్ చేసుకొని ముగించనున్నారు. థ‌మన్‌ కూడా ఇప్పటికే తన పనిని పూర్తి చేశాడని.. పాటలకు సంబంధించిన షూట్ త్వరలోనే మొదలవుతుందని తెలుస్తోంది.