టాలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నిల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ 2 సినిమా సర్టిఫై కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో సర్వే గంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాల్లో.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోస్ కీలక పాత్రలో కనిపించనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రాకటన రాలేదు. మొదటి భాగంలో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్‌లో అదరగొట్టగా.. ఇప్పుడు జైలర్ 2 లో అంతకుమించి రేంజ్ లో గెస్ట్ ఆపిరియాస్ ఉండబోతుందని.. మొదటి నుంచి ప్రచారం జోరు అందుకుంది. టాలీవుడ్ నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ.. పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.
బాలయ్య మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా.. ఆయన రోల్ ను డిజైన్ చేశారని.. తెరపై బాలయ్య కనిపించినంత సేపు స్క్రీన్ దద్దరిల్లిపోతుందని టాక్ నడిచింది. కంటిన్యూటీగా మోహన్ లాల్, శివన్న పాత్రలు పార్ట్ 1ను అనుసరిస్తూ యధావిధిగా ఉండనున్నాయని సమాచారం. ఇలాంటి క్రమంలో మరో సంచలన నటుడు.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నెల్సన్.. సూర్యతో చర్చలు జరిపాడని దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడంటూ సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన మేకర్స్ ఇవ్వనున్నారట.
నిజంగా సూర్య కూడా ఈ ప్రాజెక్టులో ఎంట్రీ ఇస్తే.. ఇక ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. బాలయ్యను పాజిటివ్ రోల్ లో లాంచ్ చేసి.. సూర్యకు నెగిటివ్ రోల్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక వీరిద్దరి మధ్యన పోరు, మాటల యుద్ధం, యాక్షన్ ముందు.. సూపర్ స్టార్ పెర్ఫార్మెన్స్ సైతం డీల పడిపోవాల్సిందే ఆ రేంజ్ లో ఇద్దరు పర్ఫామెన్స్ తో అదరగొడతారు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గానీ.. నిజంగానే వీరిద్దరి మధ్యన యాక్షన్ సీన్స్ తో సూపర్ స్టార్ ఇమేజ్ వస్తే మాత్రం.. ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. బాలయ్యకు కోలీవుడ్ లో కూడా మాస్ ఇమేజ్ దక్కుతుంది. మరి నెల్సన్ ఎలాంటి ప్లాన్‌లో ఉన్నాడో వేచి చూడాలి.