బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ సికిందర్. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన ఈ సినిమా ఈద్ కానుకగా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూవీ ప్రొడ్యూసర్ సాజిద్ నదియావాలపై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. తమ హీరో కెరీర్ నిర్మాతలే నాశనం చేస్తున్నారంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సాజిద్ నదియావాల భార్య.. సల్మాన్ ఫ్యాన్స్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. అభిమానులు తీరుపై మండిపడింది.
సల్మాన్ గత సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలుస్తున్న క్రమంలో.. సికిందర్‌పై ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. సికిందర్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ప్రొడ్యూసర్ సాజిద్ ఎన్నో ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలోనే మూవీపై ఫ్యాన్స్ లో మరింత హైప్ నెలకొంది. తీరా సినిమా రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ రావడం ఫ్యాన్స్‌కు నిరాశ కల్పిస్తుంది. కథ, కథనం, డైరెక్షన్ సరిగ్గా లేదని సినీ విశ్లేషకులు విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో.. సల్మాన్ ఫ్యాన్స్ ఎక్స్ వేదికగా సాజీద్ ను తిడుతూ రకరకాల పోస్ట్లు షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన భార్య వార్ధాఖాన్ రియాక్ట్ అవుతూ.. ఫ్యాన్స్ పోస్టులను రీ పోస్టులు చేస్తూ వచ్చింది. అంతేకాదు వారిని తిడుతూ కామెంట్స్ కూడా పెట్టింది. విమర్శలను ఈ విధంగా రీ పోస్ట్ చేయడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా.. అని ఓ అభిమాని ప్రశ్నించగా మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ స్పందించింది. వెంటనే ఆ కామెంట్స్ ఆమె డిలీట్ చేసింది.