నా ఇంటిపేరు చెడగొట్టకు.. కూతురు సుస్మితకు చిరంజీవి వార్నింగ్..!

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి టాలీవుడ్ పెద్దన్న‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాలో తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ.. మ్యాన‌రిజంతో మెప్పించిన చిరు.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆరుపదుల వయసులోనూ ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. తన అందం, ఫిట్నెస్‌తో.. ఎనర్జీటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా.. చిరు మల్లిడి వ‌శిష్ఠ‌ డైరెక్షన్లో విశ్వంభ‌ర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

How Chiranjeevi fulfilled his daughter's wish? | How Chiranjeevi fulfilled  his daughter's wish?

ఇక ఈ సినిమా తర్వాత చిరు.. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే సినిమా సెట్స్‌ పైకి రానుంది. ఇక.. తాజాగా సినిమా పూజా కార్యక్రమాలను టీం ముగించిన సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్‌లో నిర్వహించారు టీం. ఈ క్రమంలోనే చిరంజీవి తన కూతురు సుస్మితకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. #chiruanil రన్నింగ్ టైటిల్‌తో తెర‌కెక్కనున్న ఈ సినిమాకు సుస్మిత నిర్మాతగా వివరించనుంది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి సినిమాపై మొదటినుంచి హైప్‌ పెంచేసే ప్రమోషనల్ వీడియోలు మొదలు పెట్టేసాడు.

ఇందులో భాగంగా సినిమా ప్రారంభ టైంలో సినిమాలో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన ఒక కటౌట్ నుంచి.. ఆయన గురించి కాసేపు మాట్లాడి.. తమని పరిచయం చేసుకోవాలంటూ ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే మూవీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవరిని వాళ్ళు ఎంట్రడ్యూస్ చేసుకుంటున్న క్ర‌మంలో చిరంజీవి అక్కడికి రాగా.. సుస్మిత లేచి నమస్తే సార్.. నా పేరు సుస్మిత కొణిదల.. నేను మీ సినిమాకి ప్రొడ్యూసర్ అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. దీంతో చిరంజీవి మీ ఇంటి పేరు ఏంటమ్మా ఒకసారి చెప్పు.. అంటూ సుస్మితను ప్రశ్నించాడు. ఆమె కొణిదెల అని చెప్పడంతో.. ఇంటి పేరును చెడగొట్టొద్దు.. నిలబెట్టాలి. ఆల్ ది బెస్ట్ అంటూ కూతురికి స్వీట్‌ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.