వాట్.. ఒకరు కాదు ఇద్దరా.. చిరు కోసం అనిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక‌ తాజాగా సినిమా పూజా కార్యక్రమాలను ముగించారు టీం. ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పూజ కార్యక్రమంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్, నాగబాబు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, డైరెక్టర్ బాబి హాజరై సందడి చేశారు. ఇక అనీల్ రావిపూడి.. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమా కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను తెర‌కెక్కించి.. బ్లాక్ పాస్టర్ అందుకున్నాడు అనిల్. ఇక 2026 సంక్రాంతి బరిలోను చిరంజీవి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

Mega Excitement! Chiranjeevi & Anil Ravipudi's Film Officially ...

#chiruanil అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. చిరంజీవి సినిమా కోసం అనిల్ రావిపూడి అదిరిపోయే మాస్టర్ ప్లాన్ చేశాడట. అనీల్ కెరీర్‌లోనే క్రేజి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2.. మల్టీ స్టార‌ర్ గా తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి సినిమా కూడా అదేవిధంగా ప్లాన్ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాల్లో చిరంజీవి మెయిన్ హీరో.. కాగా మరో స్టార్ హీరో ఫుల్ లెన్త్ లో కనిపించుకున్న.. కాసేపు మెర‌వ‌నున్నాడ‌ని.. ఆయన పాత్ర కూడా కీలకంగా ఉండనిందని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్ అట‌.

Chiru Anil: చిరంజీవి- అనిల్‌ రావిపూడి మూవీ షురూ: హాజరైన ప్రముఖులు వీరే |  chiranjeevi-anil-ravipudi-movie-launched-mega-157

మొదటినుంచి అనిల్ రావిపూడి, వెంకటేష్ మధ్యన మంచి బాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కాంబోలో తెరకెక్కిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న ఈ బంధంతోనే అనిల్ నెక్స్ట్‌ సినిమాలో వెంకటేష్ కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలు నిజమే అనిపించేలా తాజాగా పూజ ఈవెంట్లో వెంకటేష్ మెరుసారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించిన వార్త సైతం వైరల్ గా మారుతుంది. తాజాగా హీరో సిద్దార్ధ్‌ను వివాహం చేసుకున్న అతిధీరావ్‌ హైదరి ఈ సినిమాలో హీరోయిన్గా మెరవనుందని టాక్. మరో పక్క బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రాన్ కూడా అనిల్ రావిపూడి సంప్రదించినట్లు సమాచారం. ఈ వార్తల్లో ఏది వాస్తమో తెలియాలంటే టీం క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.