ఆ స్టార్ హీరోయిన్ మొగుడి కోసం తలపడుతున్న శ్రీ‌లీల, అన‌న్య‌..

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన శ్రీలీల… తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు అందుకుంటూ రాణిస్తుంది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా.. శ్రీలీలకు బాలీవుడ్ నుండి మరో జాక్ పాట్‌ ఆఫర్ వచ్చిందట‌. హిందీలో ఓ బిగెస్ట్‌ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వ‌చ్చింద‌ని దీంతో శ్రీ‌లీల ఫుల్ ఖుషి అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్ రాజ్ శాండిల్య దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న కొత్త సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా క‌న‌బ‌డ‌నున్నాడు.

Nimma bengaluru hudugi . . . . . . . . Makeup - @pannas_makeup Styled by  @rashmitathapa Wearing @marwarcouture 📸- @ajshetty

ఈ మూవీ హీరోయిన్ కోసం సెర్చింగ్‌లు మొద‌లు పెట్టేశారు టీమ్. ఈ క్ర‌మంలోనే సినిమా అవ‌కాశాల‌కోసం చాలామంది హీరోియిన్లను లిస్ట్ చేశారట. కాగా ఇందులో ప్రధానంగా శ్రీలీల, నటి అనన్య పాండేల మధ్య గ‌ట్టి పోటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరితో టీమ్ చర్చలు జరుపుతున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు శ్రీలీల ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింద‌ని స‌మాచారం.

Sidharth Malhotra & Ananya Panday are new faces of Scott Eyewear

అయితే ఈసినిమా గురించి మరో వాదన కూడా వైర‌ల్‌గా మారుతుంది. ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండ‌నున్నార‌ని సమాచారం. అందుకే శ్రీలీల, అనన్య పాండేలతో చర్చలు జరుగుతున్నాయట‌. ఇక హీరో కోసం త‌ల‌పడే రెండు పాత్రలో ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు కనిపించ‌నున్నారట. ఇక‌ ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో ఆషికీ 3 సినిమాలో నటిస్తుంది.