ఓ హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో నటించి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. అలా అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన సినిమా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ మూవీ మరేదో కాదు బద్రి. ఎస్.. మొదట ఈ సినిమాను ధిలాన టైటిల్ తో సూపర్ స్టార్ కృష్ణ ను పెట్టి ఈ కథ తీయడానికి సిద్ధమయ్యాడట పూరి. ఇక సినిమా షూట్ కూడా మొదలై మూడు రోజుల షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే తర్వాత అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు. అసలు బద్రి సినిమా ఏంటి.. సూపర్ స్టార్ కృష్ణ నటించడం ఏంటి.. అసలు ఈ థిల్లానా కదా ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం పూరి ఎదురుచూస్తున్న టైంలో కృష్ణ గారే పిలిచి అవకాశం ఇస్తారని పూరి కూడా అసలు ఊహించలేదట. అంత త్వరగా కల నెరవేరుతుందని అసలు అనుకోలేదట. కృష్ణనగర్.. ఆర్టిసి పొట్టి వీరయ్య గారి ఎస్టిడి బూత్ కొత్త కొత్త యాక్టర్లు డైరెక్టర్లకు ఈ ఎస్ టి డి బూత్ అప్పట్లో అడ్డా.. ఇక ఈ ఎస్టీడీకి ఫోన్ వచ్చింది. పూరి అనే కుర్రాడు ఉన్నాడా అని అడిగారు. ఎస్టేడి బోర్డు ఎదురుగా ఉన్న ఇంటిపై బ్యాచిలర్ రూంలో పూరి అనే కొత్త కుర్రోడు నెల క్రితం అద్దెకు దిగాడు. ఇక ఫోన్ చేసింది మరెవరో కాదు ప్రొడ్యూసర్ ఐబికే మోహన్. వైజాగ్ కు చెందిన ఐబికె మోహన్ కు పూరి కథ చెప్పి నాలుగు నెలలైంది. కథ కూడా ఓకే అయిపోయింది. టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం పూరి జగన్నాథ్ కు కాల్ చేశారు.
మ్యాటర్ తెలుసుకొని అప్పుడప్పుడే ముత్తు సినిమాతో ప్రభంజనం సృష్టిస్తున్న థిల్లానా థిల్లానా కసి కళ్ళ కూనా సాంగ్ లోని థిలానా ను టైటిల్‌గా ఫిక్స్ చేసేసాడు. ఇక పూరి వెరైటీ, క్యాచీ టైటిల్స్ పెట్టడంలో దిట్ట. ఆయన టైటిల్స్ పరంపర అప్పటినుంచి మొదలైంది కావచ్చు. కాగా.. థిల్లానా అనే ఓ టైటిల్ తో సినిమా ఫిక్స్ అయిందని కూడా చాలామందికి తెలియదు. రౌడీ అన్నయ్య, నెంబర్ వన్, అమ్మ దొంగ లాంటి సినిమాలతో స్టార్ హీరోగా మారిన సూపర్ స్టార్ కృష్ణ చిన్న బ్రేక్ తర్వాత.. సెకండ్ ఇన్నింగ్స్‌లో సాంప్రదాయంతో బ్లాక్ బస్టర్ కొట్టి యమలీల, వారసుడు, రాముడొచ్చాడు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లతో మరోసారి ఫామ్ లోకి వచ్చారు.
ఇక ఎంత పెద్ద సీనియర్ స్టార్ హీరోలైనా సరే కథ నచ్చిన ఎక్స్పీరియన్స్ లేదని ఉద్దేశంతో పూరి కథను రిజెక్ట్ చేశారు. కానీ.. కృష్ణ గారు మాత్రం అలా కాదు అప్పటికే ఎంతోమంది కొత్త దర్శకులను పిలిచి మరి అవకాశం ఇచ్చిన ఆయన పూరి జగన్నాథ్ ను కూడా అలాగే పిలిచారట. ఇక పూరి చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చేసింది. దీంతో పూరి ఆనందానికి అవధులు లేవు. తను అనుకున్న కదా అంత త్వరగా నెరవేరుతుందని అసలు భావించలేదు. అయితే ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. థిల్లానా క్లాప్‌కొట్టి మూడు రోజుల షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఐబీకే మోహన్.. అంతకుముందు శోభన్ బాబు గారితో తీసిన దొరబాబు సినిమా ప్లాప్ కావడంతో నష్టాల్లో మునిగిపోయాడు.
దీంతో థిల్లానా సినిమా ఆపేశారు. ఈ సినిమా ఆపేసినట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ ఆలోచనలతో కూర్చుండిపోయాడట. అలాంటి క్రమంలో అటువైపు నుంచి ఓ సినిమా వెహికల్ వచ్చి ఆగింది. కృష్ణ గారితో సినిమా ఆగిపోతే ఏంటి.. నువ్వు కృష్ణ కొడుకుతో ఇండస్ట్రీ హీట్ కొడతావ్ ఏమో.. బాధపడుతూ కూర్చుంటే పనులవవ్వు ఇక్కడ అంటూ పూరీకి ఓ మాట వినిపించింది. ఆ మాట చెప్పింది మరి ఎవరో కాదు అప్పటికే సీనియర్ ఆర్టిస్ట్ గా క్రేజ్ సంపాదించుకున్న రమాప్రభ. అసలే పూరీకి కాన్ఫిడెన్స్ ఎక్కువ. దానికి తోడు రమాప్రభ చెప్పిన కామెంట్స్ ఆయనలో కొత్త ఉత్సాహం నింపాయి.
ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అదే కథలు కాస్త మార్పులు చేర్పులు చేసి అప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా బద్రి సినిమా తెరకెక్కించాడు. అలా సూపర్ స్టార్ కృష్ణ థిల్లాన సినిమా కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే.. రమ ప్రభ అసలు ఎలాంటి ఫేమ లేనప్పుడు చాలా క్యాజువల్ గా పూరితో అన్న మాటలే నిజం అయ్యాయి. రమాప్రభ.. పూరితో ఆ మాట అన్నప్పుడు ఇంకా రాజకుమారుడు సినిమా కూడా రాలేదట. అలాంటిది తర్వాత పూరీ జగన్నాథ్ మహేష్ బాబుతో ఇండస్ట్రియల్ హిట్‌ను అందుకున్నారు. దీనిని డెస్టినీ అంటారా.. లేదా పూరి జగన్నాథ్ కష్టమో తెలియదు కానీ పూరీ లైఫ్ లో మాత్రం అద్భుతాలు ఇలానే జరిగాయి.