వెంకటేషే కాదు మరో స్టార్ హీరో కూడా.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా.. మాటల మాంత్రికుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్‌లో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాకు కమిట్ అయ్యాడంటూ కొద్ది రోజులుగా న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 20 ఏళ్ల తర్వాత మరోసారి క్రేజీ కాంబో సెట్ అవుతుందని.. ఈ సినిమాలో కామెడీ వేరే లెవెల్ లో ఉండబోతుందంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ నుంచి ఎలాంటి కథనైతే జ‌నం ఎక్స్పెక్ట్ చేస్తారో.. అలాంటి పర్ఫెక్ట్ స్టోరీ వీరిద్దరు కాంబోలో తెర‌కెక్క‌నుందంటూ టాక్ నడుస్తుంది.

HeyANDHRA - Victory Venkatesh , Ram Pothineni 's Masala New Still!!! |  Facebook

అయితే తాజాగా అందుతున్న‌ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో వెంకటేష్ ఒక్కడే హీరో కాదట.. ఆయనతోపాటు మరో కుర్ర హీరో కూడా నటించనున్నాడు అంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ కుర్ర హీరో మరెవరో కాదు.. రామ్ పోతినేని. గతంలో వెంకటేష్, రామ్ పోతినేని కలిసి మసాలా సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. అయిన మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. అయితే.. త్రివిక్రమ్ శ్రీనివాసరావు సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక గతంలో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలు రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమాలో వీళ్ళ కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో మెప్పించిందో తెలిసిందే.

List of Films Directed by Trivikram Srinivas

మళ్లీ అదే తరహాలో కామెడీ చూడబోతున్నామంటూ ఆడియన్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే సినిమాపై ఆడియ‌న్స్‌లోను మంచి బజ్ నెలకొంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి. కాగా ఈ వార్తల్లో వాస్తవం ఏంటో తెలియదు గానీ.. నిజంగానే రామ్, వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో సెట్ అయితే మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే త్రివిక్రమ్.. బన్నీతో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఇప్పటికే సెట్స్ పైకి తీసుకురావాల్సి ఉంది. కానీ.. బన్నీ, అట్లీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పుష్ప లాంటి సాలిడ్ హీట్ తర్వాత ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ నటించడమే ముఖ్యమని త్రివిక్రమ్ సినిమాను.. హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే త్రివిక్రమ్, చరణ్, వెంకీ కాంబో టాక్ వైరల్ గా మారుతుంది.