కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రోల్లో చరణ్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఛాలెంజింగ్ రోల్‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సాధారణ పాత్రల కంటే వైవిధ్యమైన గెటప్స్ లోనే ఆయన ఆడియన్స్‌ను మరింత మెప్పిస్తు వ‌స్తున్నాడు. తన సహజ నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తున్నారు. వీటికి పర్ఫెక్ట్ ఉదాహ‌ర‌ణ రంగ‌స్థ‌లం. ఈ మూవీలో చ‌ర‌ణ్ చెవుడు ఉన్న వ్యక్తిగా ఎదిగిపోయి న‌టించాడు. ఇప్పటికీ అయినా నటన ప్రస్తావన వస్తే కచ్చితంగా రంగస్థలంలో రామ్ చరణ్ రేంజ్ వేరు అనే టాక్ వినిపిస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా తన నటనతో సత్తా చాటుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రిలీజై ఉంటే కచ్చితంగా నేషనల్ అవార్డు దక్కించుకునేదంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

RC16 is titled Peddi: Ram Charan sports rugged avatar in first look from Buchi Babu Sana's film with Janhvi Kapoor - Hindustan Times

ఇక ఈ సినిమా తర్వాత ఆర్‌ఆర్ఆర్ సినిమాలోనూ తన వైవిద్య షేడ్స్‌తో సహజ నటనతో శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా ఫ్లాష్‌బ్యాక్ రోల్.. అప్పన్న క్యారెక్టర్ లో న‌త్తి ఉన్న వ్యక్తిగా న‌ట‌న‌కు మంచి మార్కులు కొట్టేశాడు. సినిమా కథపరంగా సక్సెస్ అందుకోకున్నా.. చరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. కాగా ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.

Peddi update: Ram Charan finishes high-octane shoot in Hyderabad

ఇందులో చరణ్ క్యారెక్టర్ పై షాకింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. కెరీర్‌లో ఫస్ట్ టైం చరణ్ ఓ అందుడి పాత్రలో నటించబోతున్నాడని.. అంధుడైన ఆటల్లో ఊరిలోనే పెద్ద మొనగాడని.. ఏ ఆటైనా అతని టచ్ చేసే వారే లేరు అంటూ టాక్ నడుస్తుంది. రంగస్థలం తరహాలోనే ఈ సినిమాల్లో చరణ్ నట విశ్వరూపం మరోసారి చూడొచ్చని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూట్ పూర్తి చేస్తున్న టీం.. అక్టోబర్‌కి ఆడియన్స్ ముందుకు సినిమాను తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ ఒక్క డిజాస్టర్ తర్వాత.. కంబ్యాక్ ఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూడబోతున్నాం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.