సినిమాకు రూ. 25 కోట్లు ఛార్జ్ చేస్తున్న నాని.. ఫస్ట్ రమ్యనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!

నాచురల్ స్టార్ నాని తాజా మూవీ హిట్ 3 ది థర్డ్ కేస్.. మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని, టీంతో కలిసి ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సుమా ఇంట్రాగ్రేషన్ పేరుతో ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ గా మారుతుంది. ఇక హిట్ 3.. ట్రైలర్‌లో చూపించిన విధంగానే సుమ కూడా సరదా ఇంట్రాగేషన్ చేసింది. ఆమె అడిగిన ప్రశ్నలకు నాని తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు.

ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ సాధించారు.. డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా అని అడగగా మీకు చూపిస్తాను ఆ ఒర్జినల్ అంటూ హిట్ 3 డైలాగ్‌ చెప్పుకొచ్చాడు. హిట్ 3నే ఇంత వైలెంట్ గా ఉంటే.. పారడైజ్ మ్యాడ్నెస్‌కు మాక్సిమం లో కనిపిస్తుంది అంటున్నారు.. మరి అది వాస్తవమేనా అని అడగగా.. ఆ మూవీ ఓ యాక్షన్ డ్రామా అంటూ వివరించాడు. ఇక ప్రస్తుతం 25 కోట్లలో రెమ్యున‌రేషన్ తీసుకుంటున్న నాని.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో వెల్లడించారు. మీరు కెరీర్‌లో తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అని ప్రశ్నించగా.. నా మొదటి రెమ్యనరేషన్ ఎప్పుడు చాలా స్పెషల్.

Suma's HIT Interrogation Promo | Adivi Sesh | Nani | Sailesh Kolanu | Wall  Poster Cinema

మొదట్లో నాకు 4000 జీతం వచ్చింది అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు. ఇక యంగ్ హీరోలకు మీరు ఇచ్చే సలహా ఏంటి అనే ప్రశ్నకు పేషన్స్ ఉండాలని చెబుతా అంటూ వివరించాడు. ఇక సుమ.. బ్యాక్ సపోర్ట్ లేకుండా స్ట్రాంగ్ గా సెటిల్ అయ్యారు.. అసలు ఇంత ధైర్యం ఎక్కడిది అని అడ‌గ‌గా.. నా కెరీర్‌ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్న అని.. నాని హిట్ డైలాగులు వేశాడు. వీటితో పాట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచుడు నాని. ప్రస్తుతం ఆ ఇంట్రాగేషన్ వీడియో నెటింట తెగ వైర‌ల్‌గా మారుతుంది.