ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ పాప.. ప్రస్తుతం పాన్ ఇండియాను షేక్ చేస్తున్న హాట్ ఫిగర్.. గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో ట్రెండింగ్ గా మారుతూ ఉంటుంది. అలా.. ఇటీవల కాలంలో త్రో బ్యాక్ థీంతో స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అలా.. తాజాగా పాన్ ఇండియాను తన అందచందాలతో షేక్ చేస్తున్న ఓ ముద్దుగుమ్మ ఫోటోలను తెగ ట్రైండ్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఈ పై ఫోటోలో మీరు చూస్తున్న బుజ్జి పాప ఎవరో గుర్తుపట్టారా..?

Rashmika Mandanna: From national crush to box office queen - The Statesman

ఈమె ప్రజెంట్ ఓ పాన్ ఇండియన్ స్టార్ బ్యూటీ. భాషలతో సంబంధం లేకుండా ఇండియా లెవెల్లో దాదాపు అన్ని భాషల్లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. పాన్ ఇండియాలెవెల్ వరుసగా మూడ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని ప్ర‌తి మూవాతో 1000 కోట్లు కొల్ల‌గొట్టిన క్రేజి రికార్డ్ ఖాతాలో వేసుకుంది. ఇప్ప‌టికే ఈమె ఎవ‌రో అర్థం అయిపోయి ఉంటుంది. ఎస్ మీ గెస్‌ కరెక్టే. ఇక్కడ మీరు చూస్తున్న క్యూట్ బ్యూటీ.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ ర‌ష్మిక‌.

Rashmika Mandanna Has 'Moved On' From National Crush Tag: 'Was The Crush Of  The Whole College...' - News18

ప్రస్తుతం నేషనల్ క్రష్‌ ఇమేజ్‌తో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల యానిమల్, పుష్ప 2, ఛావాలతో వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న సంగతి తెలిసిందే. కాగా చివ‌రిగా వ‌చ్చిన సికెంద‌ర్ డిజాస్ట‌ర్‌గా నిలిచినా అమ్మ‌డి క్రేజ్ కాస్త‌ కూడా త‌గ్గ‌లేదు.ఈ క్రమంలోనే ప్రస్తుతం అమ్మడి చిన్ననాటి ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.