వెంకటేష్ పై కోపంతో కళ్ళద్దాలు నెలకేసి కొట్టిన కే. రాఘవేంద్ర రావు.. అసలు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడాలి. అది నటుడైన డైరెక్టర్ అయిన ఇండస్ట్రీలో రాణిస్తున్న ఇతర ఏ రంగంలో వారైనా. ఇక స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా తన నిలబెట్టుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో తెలుగు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకుని.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న కే. రాఘవేంద్రరావు కూడా చిన్న సినిమాలు తీస్తూ అంచలంచెలుగా ఎదిగిన వాడే. డైరెక్షన్ లో తనదైన స్టైల్లో సినిమాలను తెరకెక్కించి పాపులారిటీ దక్కించుకున్న రాఘవేంద్రరావు ఒకప్పుడు వరుస సినిమాలను రూపొందిస్తూ దూసుకుపోయాడు.

Kaliyuga Pandavulu - Wikiwand

ప్రస్తుతం అడపా దడపా సినిమాలను మాత్రమే దర్శకత్వం వహిస్తున్న ఈయన.. చాలా కూల్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే ఎప్పుడు చూసినా సందర్భాలు ఉండవు. అలాంటి రాఘవేందర్రావు గతంలో స్టార్ హీరో వెంకటేష్ పై కోపంతో కళ్లద్దాలు నేలకేసి కొట్టాడట. ఇంతకీ అంత కోపం ఎందుకు వచ్చింది..? అసలు ఆ కోపానికి కారణం ఏంటో చూద్దాం. వెంకటేష్ కెరీర్ ప్రారంభంలో న‌టించిన‌ సినిమా కలియుగ పాండవులు. కే రాఘవేంద్రరావు డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమా షూట్ టైంలో ఒక సీన్ చేసేటప్పుడు వెంకటేష్ సరిగా నటించలేదట. ఒకటికి పది సార్లు చెప్పిన మళ్లీ అదే కోవలో వెళ్తుండటమతో వెంకటేష్ పై కోపం తెచ్చుకున్న రాఘవేంద్రరావు సెట్లో అందరి ముందే ఆయనను అరిచి కళ్ళ‌ద్దాలు నేలకేసి కొట్టడం దీంతో దెబ్బకు సెట్ లో ఉన్న వాళ్లంతా షాప్ నిలిచింది పోయారు సరి కదా ఒక పూట వరకు ఎలాంటి పని మొదలు కూడా పెట్టలేదట.రాఘవేంద్రరావు, వెంకటేష్ కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా.. Do  you know how many movies came in the combination of Raghavendra Rao and  Venkatesh here are is listఈ విషయం రామానాయుడుతో తెలియడంతో వెంటనే సెట్స్ కు చేరుకున్న ఆయన రాఘవేంద్రరావు తో మాట్లాడి అతని కూల్ చేసి.. మళ్లీ షూట్ కు పంపారట. ఇక ఈ సినిమాతో వెంకటేష్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని.. ఫస్ట్ సినిమాతోనే తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు రాఘవేంద్ర ఏ సీన్ కోసం వెంకటేష్ ను కోపడ్డాడో.. ఆ సీన్‌లో వెంకటేష్ యాక్టింగ్ సినిమాకే హైలెట్ అని టాక్. ఇక‌ రాఘవేంద్ర రావు అలా అరిచినందుకు వెంకటేష్ మొదట బాధపడిన.. ఆ తర్వాత సినిమా రిలీజై ఆ సీన్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట. అప్పటినుంచి నటనపరంగా ఆడియన్స్ ను ఆకట్టుకోవాలంటే.. దర్శకుడు చెప్పే మాటను సరిగ్గా ఫాలో అవ్వాలి అని వెంకటేష్ ఫిక్స్ అయ్యాడ‌ట. ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు అంతలా అరిచినా.. ఆ కోపాన్ని పాజిటివ్గా తీసుకున్న వెంకీ మామ తర్వాత కూడా ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించాడు.