జైలర్ 2 బాలయ్యతో స్క్రీన్ షేరింగ్.. శివరాజ్ కుమార్ రియాక్షన్ ఇదే..!

సౌత్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 45 మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. కాగా.. త్వరలోనే సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు టీం. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరోలు, డైరెక్టర్లు సందడి చేశారు.

Dr. Shiva Rajkumar - Movies, Biography, News, Age & Photos | BookMyShow

ఈ క్రమంలోనే ఉపేంద్ర కు శివరాజ్ కుమార్‌కు ర‌క‌ర‌కాల‌ ప్రశ్నలను సాధించారు. వారు ఇంట్రెస్టింగ్ సమాధానాలను చెప్పుకొచ్చారు. ఇక ఇందులో భాగంగానే రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో మీతోపాటు నందమూరి నట‌సింహం బాలకృష్ణ కూడా స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారట కదా.. ఇందులో వాస్తవం ఎంత అని ప్రశ్నించగా.. దానికి శివరాజ్ కుమార్ రియాక్ట్ అవుతూ.. నిజమా నాకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చాడు. జైలర్ 2లో నా రోల్ ఉందని డైరెక్టర్ నెల్సన్ వివరించారు.

జైలర్ 2లో బాలయ్య?.. శివన్న క్లారిటీ ఇచ్చారుగా! | Is Balakrishna Joining  Rajinikanth in Jailer 2? Shivarajkumar Reacts to the Buzz

బాలకృష్ణ కూడా ఉంటే చాలా బాగుంటుంది. బాలకృష్ణ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో నేను నటించా. కానీ.. ఇద్దరి కాంబినేషన్‌లో సీన్స్ లేవు. వ్యక్తిగతంగా మేము చాలా క్లోజ్.. కుటుంబ సభ్యులలా ఉంటాం అంటూ శివరాజ్ కుమార్ వెల్లడించాడు. నిజంగానే బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకి కూడా ఇష్టం అన్నట్లుగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.