టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సైన్ చేసిన మూడు సినిమాలను హోల్డ్‌లో పెడుతూ వస్తున్న పవన్.. రాజకీయాలలో చిన్న బ్రేక్ దొరికినా సెట్స్‌లో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల క్రేజీ లైనప్‌లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. నీది అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్‌గా మెరవనున్నాడు.
ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల ప్రొడ్యూసర్ ఏం.ఏం.రత్నం నిర్మిస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే పవన్ కు టైం దొరికినప్పుడల్లా షూట్ ను శరవేగంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా మే 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు ఇప్పుడు వరకు సినీ ఇండస్ట్రీలోనే ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసి పెట్టిందంటూ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ రికార్డు మరేదో కాదు.. ఇప్పటివరకు.. సినీ హిస్టరీ లోనే 11 సార్లు వాయిదా పడిన ఏకైక సినిమాగా వీకరమల్లు తిరుగులేని రికార్డును క్రియేట్ చేసింది.
ప్రజెంట్ ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. దీన్ని చూసిన మెగా ఫ్యాన్స్.. పవర్ స్టార్ సినిమా అంటే ఆమాత్రం వేయిటింగ్ తప్పదు అంటూ.. ఇది పవర్ స్టార్ క్రేజ్ అంటూ.. వెయిటింగ్ కు తగ్గ స్ట్రాంగ్ రిజల్ట్ పవన్ అన్న ఇస్తాడంటూ.. రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే 30న లేదా జూన్‌లో రిలీజ్ చేసేలా టీం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే టీం అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.