కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా చిత్ర పరిశ్రమను ఎంతలా కుదిపేశాయో అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమలో కమిట్మంట్లు అడుగుతారని.. లైంగిక వేదింపులు సహజం అంటూ ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే వెల్లడించారు. కొందరైతే తమను వేదించిన హీరోలు, దర్శక నిర్మాతల పేర్లను కూడా డైరెక్టుగా బయట పట్టేశారు. మరికొందరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇష్టంలేక వేసి.. సైలెంట్ గా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఈ సమస్య ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు.. ప్రతీ రంగంలోనూ ఉంది.
మన టాలీవుడ్ లోనూ కాస్టింగ్ కౌచ్‌పై నటీమణులు చాలా సందర్భాలలో స్పందించారు. ఇదిలా ఉండగా
తాజాగా ఇదే తరహాలో ఓ స్టార్ హీరోయిన్ తన శని కెరీర్‌లో తను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఇంతకీ ఆమె ఎవరు.. తను ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తనే మళయాళ ఇండస్ట్రీలో నటిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విన్సీ అలోషియాస్. తాజాగా ఓ సందర్భంలో విన్సీ మాట్లాడుతూ.. తనకు ఏదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. డ్రగ్స్ మత్తులో ఓ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆలోషియాస్ ఆరోపించింది.
అతను ఓ లీడ్ యాక్టర్ అని.. నన్ను తన ముందే డ్రెస్ మార్చుకోవాలని టార్చర్ పెట్టాడని.. అందరి ముందే తప్పు తప్పుగా మాట్లాడాడు అంటూ వివరించింది. ఇక అప్పుడు ఆయన డ్రగ్స్ మత్తులో ఉన్నారని.. అప్పటినుంచి డ్రగ్స్ తీసుకునే వారి సినిమాల్లో నటించడానికి కూడా నేను నో చెప్పేస్తున్నానని వెల్లడించింది. అయితే తనను అంతలా టార్చర్ చేసిన ఆ నటుడు ఎవరు అనేది మాత్రం విన్సీ రివీల్ చేయలేదు. ఇక ప్రస్తుతం విన్సీ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.