రజిని, నాగ్ నటించిన మొదటి పాన్ ఇండియన్ మూవీ.. సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డిజాస్టర్.. ఏదో తెలుసా..?

ఇండియన్ ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనగానే టక్కను బాహుబలి పేరే వినిపిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ రాజమౌళి కంటే ముందే కొద్ది సంవత్సరాల క్రితం ఓహీరో ప్రారంభించాడన్న సంగతి చాలా మందికి తెలియదు. కాగా.. అప్పట్లోనే కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా ఇండియన్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచి నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చి పెట్టింది. నిర్మాత దివాలా తీశాడు. నాగార్జున, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోస్ నటించినా సినిమాకు న‌ష్టాలు త‌ప్ప‌లేదు.

ఇంతకీ ఆ మూవీ ఏదో చెప్పలేదు కదా.. అదే శాంతి క్రాంతి. 1991 లో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ చరిత్రలోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా. ఒకప్పటి కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ , ప్రొడ్యూసర్ రవిచంద్రన్. ఇండియాలోనే మొట్టమొదటి పాన్‌ ఇండియన్ సినిమాను తెర‌కెక్కించాల‌న్న త‌న కలను నెరవేర్చుకున్నాడు. కానీ.. అదే సమయంలో భారీ నష్టాలు ఆయనను కుదెలు చేశాయి. 1988లో వీర్ రవిచంద్రన్.. తన డ్రీం ప్రాజెక్ట్ శాంతి క్రాంతి సినిమాను ప్రారంభించాడు. అప్పట్లోనే సినిమా భారత దేశ నలుమూలలో ఉన్న స్టార్స్ అందరిని ఒకే చోటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు రవిచంద్రన్‌.

Nagarjuna And Kushboo Shanti Kranthi Telugu Full Movie | V Ravichandran |  Juhi Chawla | Matinee Show

ఇక ఈ సినిమా కన్నడ వర్షం లో స్వయంగా హీరోగా మెరిశాడు. తమిళ్, హిందీ వర్షన్ రజనీకాంత్.. తెలుగులో నాగార్జున నటించ‌గా.. జూహి చావ్ల, ఖుష్బు, అనంతనాగ్ కీలకపాత్రలో మెరిశారు. అప్పట్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో అంటే ఏకంగా రూ.10 కోట్ల ఖర్చుచేసి ఈ సినిమాను రూపొందించారు. నాగార్జున ,రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు నటించినా ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అవ్వడం అందరికి షాక్ కలిగించింది. కేవలం రూ.8 కోట్ల మాత్రమే సినిమా రాబట్టి నిర్మాతలకు కోల్పోనని షాక్ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ తో రవిచంద్రన్ దివాలా తీశారు. తర్వాత సర్వైవ్‌ అవ్వడానికి చిన్న బడ్జెట్ సినిమాల రీమేక్‌లు తెరకెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.