మహేష్ నటించిన ఆ మూవీ నేను ఎడిట్ చేస్తే ఇంకా బాగుండేది.. నాగ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు నాగ అశ్విన్. చివరిగా ప్రభాస్ కల్కి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని.. త్వరలోనే కల్కి సిక్వెల్‌ రూపొందించి మరోసారి బ్లాక్ బ‌స్టర్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా ఒక కాలేజ్ ఈవెంట్లో స్టూడెంట్స్‌తో ముచ్చ‌టించిన‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకుడిగా తన లైఫ్ ఎక్స్పీరియన్స్లను షేర్ చేసుకున్నాడు. ఓ స్టూడెంట్ ఇండస్ట్రీలో కొనసాగాలంటే ముఖ్యమైనది ఏది.. అని అడగగా ఇండస్ట్రీనే కాదు.. చేసే పని ఏదైనా 100% కష్టపడాలి.

Nag Ashwin on 'Kalki 2898 AD' sequel: A lot of action is still left

షార్ట్ ఫిలిం, సినిమా ఏదైనా ఇదే చివరి మూవీ అని భావించి రూపొందించాలి. నేను బుక్స్ బాగా చదువుతా. సినిమాల కంటే పుస్తకాలు మనపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతా. పరిశ్రమలో కొనసాగాలంటే పుస్తకాలు చదవడం కూడా చాలా అవసరం. మనం అనుకున్న కథ‌ ప్రతి ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఆసక్తిగా రాయాలి. ఈ క్రమంలోనే కల్కిలో ప్రతి సీన్ కోసం బ్యాక్ గ్రౌండ్ లో ఎంతో పనిచేశామంటూ చెప్పుకొచ్చాడు. తెరపై చూశాక అది ఫైటింగ్ సీన్ అంటారు. కానీ.. దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుందంటూ వెల్లడించారు. ఇక కల్కి టైంలో బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారా అన్న ప్రశ్నకు.. అశ్విన్ ఈ సినిమా వెనుక నా ఒక్కడి కష్టమే లేదు.. అది ఒక టీమ్ అంతా పడిన శ్రమ. టీమ్లో అందరి సలహాలు వింటా.. చిన్నప్పటి నుంచి మహాభారతం గురించి కొంతవరకు తెలుసు. కానీ.. సినిమా తీయాలంటే కాస్త భయపడ్డా అంటూ చెప్పుకొచ్చాడు.

Khaleja - Wikipedia

ఇక సినిమాల విషయంలో ఎడిటింగ్ పై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు నాగ్ అశ్విన్‌ రియాక్ట్ అవుతూ.. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలకు ఎడిటర్ గా కూడా పనిచేశా. సినిమా బాగా రావాలంటే ఎడిటింగ్ చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక హీరో కోసం కథ‌ రాస్తారా.. కథ రాసిన తర్వాత హీరోను సెలెక్ట్ చేస్తారా.. అనే ప్రశ్నకు మొదట కథ‌నే రాస్తా.. అందులో పాత్రల కోసం నటీనటులను సెలెక్ట్ చేసుకుంటా. కల్కిలో పాత్రలు రాసిన తర్వాత మొదట అమితాబచ్చన్.. తర్వాత ప్రభాస్‌ను ఎంపిక చేసుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఏదైనా సినిమాను మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అన్న ప్రశ్నకు నేను డైరెక్ట్ చేస్తే బాగుండేదని ఏ సినిమాకు ఫీల్ కాలేదు.. కానీ ఖలేజా, డియర్ కామ్రేడ్ సినిమాలకు మాత్రం ఎడిటింగ్ నేను చేసి ఉంటే చాలా బాగుండేదన్న ఫీల్ వచ్చింది. నాకు కామెడీ సినిమాలు అంటే ఇష్టం. ముఖ్యంగా జంధ్యాల సినిమాలు చాలా బాగా ఇష్టపడతా అంటూ చెప్పుకొచ్చాడు.