చిరు కోసం రంగంలోకి ఆ స్టార్ హీరోస్.. అనిల్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంది సత్తా చాటుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాము నటించిన సినిమాలతో ఆల్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను మెప్పించాలని.. భారీ సక్సెస్‌లు అందుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి సైతం ఒకరు. ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. తన సినిమాలతో సక్సస్‌లు అందుకోవడమే కాదు.. ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతూ వస్తున్నాడు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. మల్లిడి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభ‌ర‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Official: Chiranjeevi Launches Anil Ravipudi's Film | Official: Chiranjeevi  Launches Anil Ravipudi's Film

ఈ సినిమా తర్వాత చిరు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో సినిమాల్లో నటించనున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో ఎలాగైనా మంచి సక్సెస్‌లు అందుకోవాలని కసితో ప్రయత్నిస్తున్నాడు చిరు. కాగా.. అనిల్, చిరు కాంబో మూవీ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. కేవలం 6 నెలల్లో సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీం. ఈ క్రమంలోనే సినిమా పై ఆడియన్స్‌లోను మంచి అంచనాలు నెలకొన్నాయి.

When Superstar Rajinikanth Inspired Megastar Chiranjeevi - Filmibeat

ఇక అనిల్ – చిరు సినిమాతో ఆడియన్స్ అంచనాలను అందుకుంటాడా.. లేదా ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటాడో వేచి చూడాలి. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు.. మరో ఇద్దరు స్టార్ హీరోస్ క్యామియో రోల్‌లో నటించ‌నున్నారని.. అందులో ఒకరు వెంకటేష్ కాగా.. మరొకరు రజినీకాంత్ అని సమాచారం. వీరిద్దరూ చిరు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన స్టోరీలో వ‌చ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుందని అనిల్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్తల వాస్తవం ఎంతో తెలియదు కానీ.. నిజంగానే ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవితో కలిసి నటిస్తే మాత్రం ఆడియన్స్‌లో సినిమాపై మరింత హైప్ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.