టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్‌గా విజయశాంతి ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ తిరుగులేని స్టార్డంను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గాను నిలిచింది. కమర్షియల్ సినిమాలతో పాటు.. లేడీ ఓరియంటల్ సినిమాల్లోనూ తన సత్తా చాటుకుంది. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా ఈమె సినిమాలు రచ్చ చేసేవంటే.. అప్పట్లో ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బై చెప్పేసిన విజయశాంతి.. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి సరిలేరు నీకెవరు సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి కళ్యాణ్ రామ్.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది.
ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ తల్లి పాత్రలో మెరువనుంది. తన కెరీర్ లో వందల సినిమాల్లో నటించిన విజయశాంతి.. చిరంజీవి, బాలకృష్ణలతో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంది. ఈ క్రమంలోనే వీరితో వైజయంతిది హీట్ పేయిర్ అన్న ఇమేజ్ కూడా క్రియేట్ అయింది. ఇక తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో వాళ్ల సినిమాలకే గట్టి పోటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో సందడి చేస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి, బాలకృష్ణలతో ఫ్యూచర్ లో సినిమాలు చేసే అవకాశం ఉందా అనే ప్రశ్న ఎదురుకాగా ఆమె.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
విజయశాంతి మాట్లాడుతూ నేను ఇకపై బాలయ్య, చిరులతో సినిమాలు చేసే అవకాశమే లేదని స్టేట్మెంట్ ఇచ్చింది. మునుముందు అసలు సినిమాల్లో నటించని నటించిన అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంపికైన నేపథ్యంలో బాధ్యతలు మరింతగా పెరిగాయి అంటూ చెప్పుకోవచ్చిన విజయశాంతి.. నాకు సినిమాలు చేయడం కుదరదని.. అందులో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చేసే అవకాశం అస్సలు లేదని.. క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం తాను నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ్ రామ్ తల్లిగా.. ఐపీఎస్ ఆఫీసర్‌గా మెరువనుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే.. పవర్ఫుల్ ఉమెన్ గా ఆమె కనిపించనుంది. ఇక కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ గ్యాంగ్‌స్టర్‌గా మెరువనున్నాడు. దీంతో.. ఇద్దరి మధ్య పోరాటం.. తల్లి కోసం కొడుకు ఎలా మారాడు.. అనేదే సినిమా స్టోరీ. తల్లి, కొడుకు సెంటిమెంట్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని.. తాజా ప్రమోషన్స్ లో ఎన్టీఆ,ర్ విజయశాంతి వెల్లడించారు. ఇక నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.