టాలీవుడ్ ఆడియన్స్లో అషూ రెడ్డికి పరిచయాలు అవసరం లేదు. మొదట టిక్ టాక్ రీల్స్, డబ్ స్మాష్లతో పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ జూనియర్ సమంతగా ఇమేజ్ సొంతం చేసుకుంది. తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశాన్ని కొట్టేసింది. తన ఆటతీరుతో ఆడియన్స్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ గా పలుషోలతో బిజీ అయింది. కాగా.. ఇలాంటి క్రమంలో అమ్మడు ఆసుపత్రి పాలయినట్లు ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది. తను హాస్పిటలైజ్ అయినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడిస్తూ ఎమోషనల్ వీడియోను షేర్ చేసుకుంది.
దీన్ని చూసిన అభిమానులంతా ఆందోళన పడుతూ అసలు అషూకి ఏమైంది అంటూ.. అసలు ఈ బ్రెయిన్ సర్జరీ ఎందుకు అంటూ.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను డాక్టర్స్ బ్రెయిన్ ట్రీట్మెంట్ కు సిద్ధం చేస్తున్న వీడియోను.. తన ఇన్స్టా వేదికగా మనం చూడవచ్చు. ముఖ్యంగా సర్జరీ కోసం జుట్టు కత్తిరించడం ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. ఇక ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అషూ తీవ్ర వేదన అనుభవించిందట. సర్జరీ తర్వాత తను ఎలా రికవరీ అయిందో కూడా వీడియోలో షేర్ చేసుకున్న అషూ.. జీవితం చాలా చిన్నది.. ఎంతోమంది నా చుట్టూ ఉండి నేను కోలుకునేలా ప్రార్థించారు. వారందరికీ నా ధన్యవాదాలు అంటూ అషూరెడ్డి చెప్పుకొచ్చింది.
తన పోస్ట్ కు బ్రెయిన్ సర్జరీ హ్యాష్ ట్యాగ్ జోడించడంతో.. అమ్మడికి బ్రెయిన్ సర్జరీ అయిందని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెటింట తెగ వైరల్ గా మారుతుంది. దీంతో.. ఆమె అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం అషూ త్వరగా కోలుకోవాలని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి బ్రెయిన్ సర్జరీ ఎందుకు చేశారని దానిపై క్లారిటీ లేదు. కాగా.. ఇది ఇప్పుడు చేసిన బ్రెయిన్ సర్జరీ కాదని.. గతేడాది ఆమెకు చేసిన బ్రెయిన్ సర్జరీ వీడియోను ఇప్పుడు ఆమె షేర్ చేసుకున్నట్లు సమాచారం. సర్జరీ తర్వాత తను ఎలా రికవరీ అయ్యాను వివరిస్తూ ఈ వీడియోను అషూ రెడ్డి పంచుకుంది.
View this post on Instagram