నందమూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా, నిర్మాతగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు కళ్యాణ్ రామ్. ఇక తాజాగా ఆయన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. సాయి మంజులక్కర్ ఆయనకు జంటగా మెరిసింది. ప్రదీప్ చిలకలూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి కళ్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక ఏప్రిల్ 18 అంటే రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు టీం.ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచి వరుస ఈవెంట్‌లలో సందడి చేస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ ప్రచార చిత్రాలతో పాటు.. సాంగ్స్ రిలీజ్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఆడియన్స్‌ని ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో.. అంచనాలను అందుకొని లాభాలు కురిపిస్తుందో.. లేదో.. వేచి చూడాలి.
కాగా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెల్కొన క్రమంలో సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్లు కూడా భారీ లెవెల్లో జరిగినట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.24 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిందని టాక్ నడుస్తుంది. భారీ టార్గెట్ తోనే బాక్స్ ఆఫీస్‌లో దిగుతున్న కళ్యాణ్ రామ్.. ఈ సినిమాతో రూ.24 కోట్ల కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను కలగొట్టి హిట్ స్టేటస్‌ను అందుకోబడం కళ్యాణ్‌రామ్‌కు కూడా చాలా అవసరం.ఇక ఫ్యూచర్‌లో సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో వేచి చూడాలి.