టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో చరణ్ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. స్టార్ హీరో హోదాను కూడా సొంతం చేసుకున్నాడు. కాగా.. ఈ సినిమాకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా శివ శంకర్ మాస్టర్ వ్యవహరించగా.. అయినా తనయుడు విజయ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. మగధీర సినిమా టైంలో చరణ్ కు గాయాలు అవడంతో చిరంజీవికి భయపడి అలా చేసామంటూ ఇంటరెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఒకప్పటి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. నాన్న శివ శంకర్ మాస్టర్ దగ్గర నేను అసిస్టెంట్గా చేశా.
ఈ క్రమంలోనే రామోజీ ఫిలిం సిటీలో పదిహేను రోజులపాటు సాంగ్ కంపోజ్ చేయాల్సి వచ్చింది. అదే టైంలో చరణ్ గుర్రపు స్వారీ చేసే టైంలో ఆయనకు గాయాలయ్యాయి. ఇక తాను సాంగ్ షూటింగ్‌లో పాల్గొనలేనని చరణ్ చెప్పడంతో చేసేదేమి లేక.. కాజల్‌ను ఎక్కువగా చూపించాం. అయితే డ్యాన్స్ కంపోజింగ్ అంతా చూసిన తర్వాత రాజమౌళి ఎలా రియాక్ట్ అవుతారు అని ఎంతో భయపడ్డాం. కానీ.. ఆ తర్వాత అసలు విషయం చెప్పడంతో నువ్వేం భయపడకు నేను మీ నాన్నకు చెబుతా అని రాజమౌళి నాకు ధైర్యం చెప్పారని.. తర్వాత పాట కోసం ఏం కావాలో అది తీసుకుని మిగతాదంతా ఎడిట్ చేసి ఇచ్చా.. టైం కి నాన్నగారి దగ్గరికి రాజమౌళి గారు వచ్చి నాకు రాంచరణ్‌తో ఎక్కువ డాన్స్ వద్దు.. కేవలం కాజల్‌తోనే ఎక్కువ డ్యాన్స్ చూపించండి.. ఈ పాటకి అదే అవసరమని నాన్నతో చెప్పారు. దాంతో నాన్న కూడా దానికి ఓకే చెప్పేశారు.
కానీ.. అదే టైంలో మా నాన్న చరణ్ తో డాన్స్ ఎక్కువగా చేయించకుండా.. కేవలం కాజల్‌తోనే ఎక్కువగా డ్యాన్స్ చేయిస్తే చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారు అని చాలా భయపడ్డారట. కానీ.. ఆ విషయంలో రాజమౌళి బాధ్యత తీసుకొని నేను చిరంజీవి గారికి సార్ది చెప్తా.. చిరంజీవికి ఈ పాట కోసం నాకు హీరో కాదు.. హీరోయిన్ డ్యాన్స్ ఎక్కువగా ఉండాలని వివరిస్తా అని చెప్పుకొచ్చారట. అలా మగధీర షూటింగ్ టైంలో చెక్రీకి గాయాలు అవడంతో పాటు.. షూటింగ్ చేసే టైంలో కొన్ని ఇబ్బందులు పడ్డామని.. గ్రాఫిక్స్ ఎక్కువగా వాడకుండా చాలా కష్టపడి ఆ సాంగ్ డిజైన్ చేశామంటూ కొరియోగ్రాఫర్ శివ శంకర్ తనయుడు విజయ్ చెప్పుకొచ్చాడు. తాజాగా.. విజయ్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.