” అర్జున్ సన్నాఫ్ వైజయంతి ” ట్విట‌ర్ రివ్యూ.. క‌ళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా.. హైలెట్స్‌ ఇవే..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజ‌య‌శాంతి లీడ్ రోల్‌లో న‌టించిన తాజా మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ రూపొందిన ఈ సినిమాకు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూస‌ర్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌ చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా మెర‌వ‌నుంది. ఈ క్ర‌మంలోనే మూవీపై ఆడియ‌న్స్‌లో ఆసక్తి నెలకొంది.ఇక సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గ్రాండ్ ప్రమోషన్స్ తర్వాత భారీ హైప్‌తో నేడు (శుక్రవారం) రిలీజ్ అయిన‌ ఈ మూవీ.. ప్రీమియర్ షోలు ఇప్ప‌టికే ముగ్గిశాయి. ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్‌ను సినిమా ఎలా మెప్పించిందో.. ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చిందో.. కళ్యాణ్ రామ్ కి హిట్ ప‌డిందా.. లేదా.. ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

Arjun Son of Vyjayanthi Nandamuri Kalyan Ram, Vijayashanti in an epic mother-son showdown - India Today

విజయశాంతి పోలీస్ అధికారిగా కూంబింగ్ నిర్వహించే సీన్‌తో మూవీ మొదలయ్యింది. ఈ సీన్ చూసే వింటేజ్ విజయశాంతి గుర్తుకొస్తుంది. అలాగే తల్లి, కొడుకుల సెంటిమెంట్ సీన్స్ సినిమాకే హైలైట్‌. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఇంట్ర‌స్టింగ్ సీన్స్ ఉన్నాయి. తల్లి, కొడుకుల మధ్య స్టోరీ ఇంట్ర‌స్టింగ్‌గా సాగుతుంది. కాగా తర్వాత కథ రొటీన్‌గా మారిపోయింది. గతంలో వ‌చ్చిన చాలా సినిమాల మాదిరి రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లోనే మూవీ సాగిందని.. ఇక సినిమాకు అతిపెద్ద డ్రాబ్యాక్ మ్యూజికే అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అజినీష్ లోకనాథ్ బిజియం, మ్యూజిక్ అస‌లు ఆకట్టుకోలేదు. కీ సీన్స్‌ ఎలివేట్ చేయడంలోను ఆయన ఫెయిల్ అయ్యాడ‌నే టాక్ న‌డుస్తుంది.

Nandamuri Kalyan Ram: Censor Board clears Nandamuri Kalyan Ram's 'Arjun S/O..

ఇక మూవీ యాక్షన్ బ్లాక్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదిక‌గా షేర్ చేస్తున్నారు. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కొన్ని చోట్ల ఈ మూవీ జనతా గ్యారేజ్ కాన్సెప్ట్‌తో సాగిన ఫీల్ క‌లుగుతుంద‌ట‌. ఇక సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్‌కు గూస్ బంప్స్ ఖాయం అంటున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి ఇద్దరూ ఎమోషనల్ గా ఆడియన్స్‌ని మెప్పించారు. ఇక‌ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో పాటు.. కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్‌.. టెర్రిఫిక్ స్క్రీన్ ప్రజెన్స్.. డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయ‌ని చెప్తున్నారు. ఈ మూవీలో మైనస్‌లు ఫస్ట్ హాఫ్ రొటీన్ ప్యాట్ర‌న్‌, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ సాగ‌దీత‌.. బ్యాగ్రౌండ్ స్కోర్.ఈ మూవీని కళ్యాణ్ రామ్, విజయశాంతి మ‌ధ్య‌ తల్లి కొడుకుల సెంటిమెంట్.. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో డిజైన్ చేశాడు డైరెక్ట‌ర్‌. ఈ మూవీలో ఊహించని ట్విస్ట్ లు పెద్ద‌గా లేవు. అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే మూవీ చూడొచ్చు.