చిరు మూవీలో అనీల్ మార్క్ ట్విస్ట్.. బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కానా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో సినిమాపై ఆడియన్స్‌ను ఎప్పటికప్పుడు అంచనాలను పెంచుతూ దూసుకుపోతున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలొ హీరోయిన్‌పై రకరకాల వార్తలు వైరల్‌గా మారాయి. అయితే.. హీరోయిన్ ఎవరనే దానిపై అఫీషియల్ ప్ర‌క‌ట‌న‌ మాత్రం రాలేదు. ఇక అనీల్ రావిపూడి నుంచి ఓ సినిమా వస్తుందంటే.. హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ హైలైట్ అవుతూ ఉంటుంది. కారణం.. హిట్ ఉన్న హీరోయిన్స్‌ని కాకుండా ఫ్లాప్ ఉన్న హీరోయిన్లను తీసుకొని అనిల్ హిట్ కొడుతూ ఉంటాడు. గతంలో ఆయన తెర‌కెక్కించిన సినిమాలు చూస్తే ఇది క్లారిటీగా అర్థమవుతుంది.

Chiranjeevi on his next with Anil Ravipudi - The South First

అయితే.. ఇప్పుడు చిరంజీవి విషయంలో కూడా అనిల్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడట. చిరును డైరెక్ట్ చేస్తున్న అనిల్ ఈ సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్‌ను వర్కౌట్ చేస్తున్నాడని.. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ అవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకొనే ఫ్లాప్ బ్యూటీ మరెవరో కాదు పూజ హెగ్డే. ఆల్రెడీ పూజ హెగ్డే తో అనిల్‌కు మంచి బాండింగ్ ఉంది. అంతేకాదు ప్రెజెంట్ పూజ హెగ్డేకు సరైన సక్సెస్ లేక సతమతమవుతుంది.

Pooja Hegde Height, Age, Family, Wiki & More

ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి.. చిరు సినిమా కోసం పూజా హెగ్డేను చూస్ చేసుకున్నాడని సమాచారం. ఇక గతంలో చిరంజీవి, రాంచరణ్ మల్టీస్టారర్ ఆచార్యల్లో పూజా హెగ్డే చరణ్ కు జంటగా నటించింది. ఇప్పుడు అదే చరణ్ తండ్రి మెగాస్టార్ చిరు సరసన నటించనుందని సమాచారం. ఇక సినిమాని కూడా వెంకటేష్ హీరోని గుర్తు చేసేలా తన మార్క్ కామెడీని కూడా జోడించి రూపొందించనున్నాడు అనిల్. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో ఆయన విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాడు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్ కొడతాడో లేదో వేచి చూడాలి.