హిట్ 3 ప్రి రిలీజ్ బిజినెస్ … నాని గారి టార్గెట్ ఎన్ని కోట్లో తెలుసా… !

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. నిర్మాతగా ఆడియన్స్‌ను పలకరించనున్న తాజా మూవీ హిట్ 3. మే 1న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న‌ ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. భారీ లెవెల్లో బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ధియేటర్ బిజినెస్లు పూర్తయ్యాయి. ఇక ఫ్రీక్వెన్ క్రేజ్ తోడు కావడంతో.. ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

Hit 3 teaser: Nani's Arjun Sarkaar is less of a cop, more of ...

ఈ క్రమంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.40 కోట్ల మేర వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ.30 కోట్లకు అమ్ముడయ్యాయట‌. ఓవర్సీస్, కర్ణాటక, ఇతర ఏరియాల హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా రిలీజ్ కానున్న క్రమంలో.. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేస్తు బిజీగా ఉన్నారు టీమ్. ఇంకా ఇతర భాషల హక్కులు ఉండనే ఉన్నాయి.

Nani treats fans to the official poster of 'HIT: The 3rd Case' as a  Christmas gift | Telugu Movie News - Times of India

ఈ నేప‌ద్యంలో యూనివర్సల్ జానర్ కనుక.. ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సినిమాకు భారీ లాభాలు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక టాలీవుడ్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతుంది. ఇలాంటి క్ర‌మంలో హిట్ 3 కనుక బ్లాక్ బస్టర్ కొడితే.. టాలీవుడ్ కు మంచి రిప్రెష్‌మెంట్‌ వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.