అలనాటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 90స్ కిడ్స్‌కు కూడా ఈ అమ్మడు సుపరిచితమే. ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తను నటించిన అన్ని సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్‌లు అందుకుంది. ప్రేమికుల రోజు సినిమాతో ఎవరు గ్రీన్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక చిరంజీవితో శంకర్ దాదా ఎంబిబిఎస్, మహేష్ బాబు – మురారి, నాగార్జున – మన్మధుడు లాంటి సినిమాలతో తన నటనకు ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఆమె నటించిన ఇంద్ర సినిమా గురించి అయితే ఇప్పటికే ఎంతోమంది మాట్లాడుకుంటూనే ఉంటారు.
చాలామందికి.. ఇప్పటి స్టార్ హీరోలకు సైతం ఇది ఫేవరెట్ మూవీ. ఇలా తను నటించినా అన్ని పాత్రలను ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సోనాలికు.. ఓ టాలీవుడ్ హీరో అంటే అస్సలు నచ్చదట. కనీసం అతను ఎదురుపడిన మాట్లాడను కూడా మాట్లాడదట. ఈ క్రమంలోనే కనీసం అతనితో స్క్రీన్ కూడా షేర్ చేసుకోలేదట. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న క్రమంలో ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోలుగా ఉన్న అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అతనితో మాత్రం అవకాశం వచ్చిన నో అని చెప్పేసిందట. అప్పట్లో ఆయన కూడా ఓ తోపు హీరోనే. కానీ.. సోనాలి ఆయనను రిజెక్ట్ చేసిందట.
దానికి కారణం ఇంటర్వ్యూలో ఆ హీరో సోనాలి బింద్రే పై చేసిన నాటి కామెంట్స్ అన్ని తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఇంటర్వ్యూ అటెండ్ అయినా ఆ స్టార్ హీరో.. అందరి హీరోయిన్స్ గురించి ఒక మాటలో చెప్తూ.. సోనాలి బింద్రే గురించి హర్ట్ అయ్యే విధంగా కామెంట్లు చేశాడట. అప్పటినుంచి సోనాలి బింద్రేకు ఆ హీరో అంటే అసలు పడదట. అతనికి చాలా దూరంగా ఉంటుంది. సినిమాలో అవకాశం వచ్చినా సరే ఎంత మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని తెలిసినా రిజెక్ట్ చేసిందట. ఇప్పటికీ వాళ్ళిద్దరూ ఎక్కడ కనిపించినా మాట్లాడుకోరు సరి కదా సోనాలి కనీసం అతని వైపు కూడా చూడదు. దీన్నిబట్టి ఆమె హీరో చేసిన కామెంట్లకు ఎంతలా హర్ట్ అయిందో అర్థమవుతుంది.