టాలీవుడ్ సినీయర్ స్టార్ హీరో జగపతిబాబు ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. కాగా జగపతిబాబుకి ఇద్దరు కుమార్తెలు. ఇక ఆయనకు క్యాస్ట్ ఫీలింగ్ అసలే ఉండదు. కులం గురించి ఆయన ముందు ప్రస్తావన వస్తే సహించడు. ఈ క్రమంలోనే.. పెద్ద కూతురు ప్రేమ కోసం.. ఆమెకు కులాంతర, మతంత్ర వివాహామే కాదు.. ఖ్డాంతర వివాహానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆమె ప్రేమించిన అమెరికన్ వ్యక్తితో పెళ్లి చేశాడు. ఇక తాజాగా ఆమె వివాహం గురించి ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ.. పెద్ద కూతురికి పెళ్లి చేసి అనవసరంగా తప్పు చేసానని.. చిన్న కూతురికి మాత్రం నేను పెళ్లి చేయను అంటూ చెప్పేసాడు.
కూతురికి పెళ్లి చేయడం బాధ్యత కదా అని యాంకర్ ప్రశ్నించగా.. తొక్కలో బాధ్యత. ఎందుకు బాధ్యత ఉండాలి. తన ఇష్టాలను గౌరవించడం ప్రేమ అవుతుంది. తల్లిదండ్రులకు పిల్లల పట్ల బాధ్యత కాదు.. ప్రేమ ఉండాలంటూ చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని నా చిన్న కూతురుకి కూడా చెప్పానని.. నేనైతే పెళ్లి చేయను నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఆ వ్యక్తిని తీసుకొస్తే చెప్పు.. పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు చేసేస్తా.. నాకు నేనుగా మాత్రం పెళ్లి చేయనని వివరించాడట. పిల్లలకు నచ్చినట్లు బ్రతకనిస్తే అది ప్రేమ అవుతుంది. బాధ్యత అంటే మన స్వార్థం కోసం పిల్లలను బలి చేయడం అంటూ జగపతిబాబు కామెంట్స్ చేశారు.
నా దృష్టిలో బాధ్యత కంటే ప్రేమే గొప్పదని.. బాధ్యత అనేది తప్పు పదమని వివరించాడు. తన దృష్టిలో బాధ్యత అంటే పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పడం. ప్రేమ అంటే.. నీకు ఏది ఇష్టమైతే అది చేయమని చెప్పడం అంటూ జగపతిబాబు వివరించాడు. ఇక పిల్లల విషయంలో తను తీసుకున్న నిర్ణయం ఏదైనా భార్య కూడా ఏకీభవిస్తుందని వివరించాడు. అయితే జగపతిబాబు చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో.. అసలు పెద్ద కూతురికి పెళ్లి చేసే తప్పు చేశానని జగపతిబాబు అనడం ఏంటి.. అసలు వాళ్ళ లైఫ్ కు ఏమైంది.. పెద్ద కూతురు డివోర్స్ తీసుకుందా.. ఎందుకు అయినా అలాంటి కామెంట్స్ చేశాడు అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.