టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వీరిద్దరి కాంబోలో.. కామెడీ ఎంటర్టైనర్ సినిమా రూపొందింది. ఇక సినిమా రిలీజ్ కోసం ఎప్పటినుంచో ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త నెటింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా అనీల్, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా తరహాలోనే అనిల్ రావిపూడి చిరుతో కూడా సినిమాను తెరకెక్కించాలనుకున్నాడట. భార్యాభర్తల కథాంశంతో.. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందినందుని ఆడియన్స్‌లో ఈ సినిమా కడుపుబ్బ నవ్వించడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఉగాది స్పెషల్ డే రోజే.. సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్ లెవెల్లో ప్రారంభించారు. ఇక ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ హాజరై సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇలాంటి క్రమంలో చిరు అలాగే అనిల్ రావిపూడి సినిమా టైటిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకు చిరునవ్వుల పండుగ.. అనే టైటిల్ను పెట్టాలని మేకర్స్ చూస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాక్ వైరల్ గా మారుతుంది. సినిమా పూర్తిగా కామెడీ జోనర్లో తెరకెక్కనున్న నేపథ్యంలో.. చిరు పేరుతో అనిల్ మార్క్ కలిసి వచ్చేలా చిరునవ్వుల పండగ అనే టైటిల్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో మేరవనన్నాడని సమాచారం. త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రానుందట.