పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ స్పిరిట్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నా.. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్‌పైకి రానుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
ఇలాంటి క్రమంలో మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ అస్డేట్‌ను షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఉగాది పండుగ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. స్పిరిట్ సినిమాపై రియాక్ట్ అవుతూ ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ అంతా మెక్సికోలో జరగబోతుంది అంటూ వివరించాడు. ఇంతకంటే ఏం అప్డేట్ ఇవ్వలేమని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ మూడు వైవిధ్యమైన సరికొత్త లుక్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమా తరహాలోనే స్పిరిట్‌లో కూడా ప్రభాస్ డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడట.
ఇక ఇప్పటికే ప్రభాస్ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మెరువనున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఇక.. ఆయన గత సినిమాల్లో ప్రియురాలు, తండ్రి పై హీరోలు పిచ్చి ప్రేమను చూపించినట్లే.. స్పిరిట్ సినిమాలో పోలీస్ వృత్తిపై.. ప్రభాస్ పిచ్చి ప్రేమ, తెగింపు చూపిస్తాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను ప్రారంభించనున్నారని.. ఇక జనవరి కల్లా పూర్తి షూటింగ్ను కంప్లీట్ చేసి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
#Spirit shoot is going to happen in Mexico..
– @imvangasandeep#Prabhas pic.twitter.com/U6SV8Z53o1
— Suresh PRO (@SureshPRO_) March 30, 2025