‘ సికిందర్ ‘ కు బిగ్ షాక్.. రిలీజ్ కు ముందే ఆన్లైన్లో ఫుల్ మూవీ.. పోలీసులను ఆశ్రయించిన టీం..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. తాజాగా నటించిన మూవీ సికిందర్. రష్మిక మందన హీరోయిన్గా నటించగా.. ఏ.ఆర్.మురుగదాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ మూవీని నేడు (మార్చ్ 30) తాజాగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు టీం. అయితే ఈ సికిందర్ సినిమా రిలీజ్కు ఒకరోజు ముందే అంటే.. నిన్న (శనివారం) ఆన్లైన్‌లో ఫుల్ మూవీ లీక్ అయిపోయింది. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్, ఫిల్మిజిల్లా సహా.. వివిధ టెలిగ్రామ్ గ్రూపులోను వెబ్ పోర్టల్లోనూ హెచ్డి ప్రింట్ లీక్ కావడంతో టీంకు బిగ్‌ షాక్ తగిలింది.

Salman Khan and Rashmika Mandanna for Sikander new song :  r/BollyBlindsNGossip

పైరసీ సైట్లకు చ‌ట్ట‌విరుద్ధంగా సినిమాలను ఆన్లైన్‌లో డౌన్లోడ్ చేయకూడదని, అనవసరమైన లింకులను అందించకూడదని.. ఎన్నో చట్టాలు ఉన్నా అక్రమ పైర‌సి సైట్లపై కఠిన చర్యలు ఉన్న.. ఈ పైరసీ విధానం మాత్రం బాలీవుడ్‌కు పెద్ద సమస్యగా మారింది. సికిందర్ సినిమా ధియేటర్లలో.. క్యాంకార్డర్ రికార్డింగ్ నుంచి ఈ ప్రింట్ లీకై ఉండవచ్చని తెలుస్తుంది. క్యాంకార్డర్ రికార్డింగ్ల నుంచి సినిమా వేగంగా హెచ్డి క్వాలిటీ కి అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత గంటల్లోనే పైరేటెడ్ సైట్స్‌లో అప్లోడ్ అవుతూ ఉంటాయి.

Sikandar New Song Teaser: Salman Khan And Rashmika Mandanna's Party Anthem  To Drop On...

ఇక గతంలోనూ.. ఇలానే ఇతర టోరెంటో వెబ్సైట్‌లో పుష్ప 2, ఛావా, స్త్రీ 2, కల్కి 2898 ఏడి, సింగం ఎగైన్, భుల్ భులాయ 3, దేవర, పఠాన్, జవాన్, గాదర్ 2, అనిమల్ లాంటి భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఆన్లైన్ పైరసీ సమస్యను ఎదుర్కొన్నాయి. ఈ విషయంలో ప్రముఖ సినీ క్రిటిక్, ట్రేడ్ నిపుణుడు కోమల్ సాత తన ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. సికిందర్ లీక్ కావడం సల్మాన్ కు పెద్ద షాక్ అని.. ఇది ఏ నిర్మాతకైనా చాలా చెడు పరిణామం అని.. థియేటర్లో రిలీజ్ కాకముందే ఆన్లైన్లో లీక్ అయింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే రియాక్ట్ అయిన నిర్మాతలు 600 ప్రదేశాల నుంచి ఈ సినిమాను తొలగించాలని అధికారులకు రిక్వెస్ట్ చేశారంటూ వివ‌రించాడు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. పైరసీ రకం పెరిగిపోతుంది. ఇది సల్మాన్ సినిమాలకు పెద్ద దెబ్బ కావచ్చు అంటూ పేర్కొన్నాడు.