ప్రభాస్ పీఆర్వో పై పోలీస్ కేస్.. షాక్ లో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పిఆర్ఓగా చెప్పుకునే సురేష్ కొండి ల‌నే వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేస్ నమోదయింది. తనను చంపుతానని బెదిరించాడంటూ.. ఓ జ‌ర్న‌లిస్ట్ 9యూట్యూబర్‌) చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభాస్ పిఆర్ఓ పై కేసు నమోదు చేశారు. ఇంతకీ అసలు ఈ కేస్ పూర్తి వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 లో ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఒక జర్నలిస్ట్ అసోసియేటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల తన న్యూస్ ఛానల్‌లో ప్రభాస్ ఆరోగ్యం గురించి ఒక వీడియోను షేర్ చేశాడు ఆ జర్నలిస్ట్.

డార్లింగ్ ఇన్ డేంజర్, 6 నెలలు బెడ్ రెస్ట్ తప్పదు | Darling Prabhas admitted  to hospital | Manamtv

డార్లింగ్ ఇన్ డేంజర్ అనే హెడ్డింగ్ తో ఈ నెలలోనే ప్రభాస్ కు మేజర్ సర్జరీ జరగబోతుందంటూ వీడియోను పోస్ట్ చేయ‌డంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరిసటి రోజు ప్రభాస్ కొండి.. ప్రభాస్ పిఆర్ఓని అంటూ కాల్ చేసి.. అసోసియేటివ్‌ ఎడిటర్‌తో మాట్లాడుతూ.. నేను ప్రభాస్ పిఆర్ఓని. ప్రభాస్‌కు మేజర్ సర్జరీ జరిగిందంటూ.. అనారోగ్యం బారిన పడ్డాడంటూ వీడియో పెట్టారు. ఆ పోస్ట్ కి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటూ సురేష్ ప్రశ్నించాడు. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని బెదిరించడంతోపాటు.. అసభ్య పదజాలాన్ని కూడా వాడాడట‌.

Happy Birthday to Pan India Star Prabhas | Happy Birthday to Pan India Star Prabhas

అయితే ఈ వీడియోను సదరు జర్నలిస్ట్ డిలీట్ చేయకపోవడంతో సురేష్ ఇదే వీడియోను ప్రభాస్ అభిమానులు అందరికి షేర్ చేయ‌డంతో.. ఆ జర్నలిస్టుకు బెదిరింపు కాల్స్ తో పాటు.. దూషిస్తూ.. ఎస్ఎంఎస్, ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ల ద్వారా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీన కొంతమంది యువకులు.. ఆ యూట్యూబ్ ఛానల్ కార్యాలయం పై దాడి చేశారు. తాము ప్రభాస్ అభిమానులం అంటూ వచ్చి వాగ్వాదానికి దిగారు. దీంతో జర్నలిస్ట్ పోలీసులకు కాల్ చేసి జరిగిన పరిణామాన్ని వివరించాడు. వెంటనే రియాక్ట్ అయిన జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక ఈ వాగ్వాదం అంతా సద్దుమణిగిన తర్వాత ఈ న్యూసెన్స్ అంతటికి కారణమైన సురేష్ కొండి పై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేసి.. కేసు నమోదు చేశారు.