స్టార్ హీరోయిన్ సమంతకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దాదాపు అన్ని భాషల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ఈ అమ్మడు.. దాదాపు దశాబ్ద కాలంపాటు తెలుగులోనే స్టార్ హీరోయిన్ టాలీవుడ్‌ను షేక్ చేసింది. తెలుగు అగ్రహీరోలా అందరి సరసన నటించి మెప్పించింది. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా.. సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తన నటనతో సినిమాల పరంగా ఎదగడమే కాదు.. భారీగా ఆస్తులను కూడబెట్టుకున్న సమంత.. ప్రస్తుతం లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ అస్తుల వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.
సమంతకు హైదరాబాద్లోని ఉన్నత ప్రాంతంలో.. భారీ పెంట్ హౌస్.. బేస్డ్ లగ్జరీ హోమ్ ఉంది. ఈ విలాసవంతమైన భవనాన్ని మాజీ భర్త నాగచైతన్యతో కలిసి.. ప్రముఖ నటుడు మురళీమోహన్ నుంచి సమంత కొనుగోలు చేసింది. అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత.. సమంత ఇంటిని అదే నటుడికి అమ్మేసినట్లు సమాచారం. ఇక ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తన కోసం సమంత ఆ ఇంటిని కొనుక్కుందని అందులోనే నివసిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక అప్పట్లో బంగ్లా ఖరీదు అక్షరాల కోటి రూపాయలు. సమంత ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బిజినెస్ ప్రారంభించి అక్కడ కూడా రాణిస్తుంది. తన స్నేహితులతో కలిసి రెండు మూడు వ్యాపారాల్లో డబ్బులు కూడబెడుతుంది. ఇక సమంతకు స్నేహితులతో కలిసి ఏకై ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనే ప్లే స్కూల్ ఉంది.
సమంత సఖి దుస్తుల బ్రాండ్ ను కూడా నిర్వహిస్తోంది. అంతేకాదు వ్యాపారాలతో పట్టు చారిటీ ఫౌండేషన్ కూడా నడుపుతూ.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల చికిత్సలకు, చదువుకు డబ్బులు అందిస్తు ప్రశంసలు అందుకుంటుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమాలో నటించని సమంత.. బాలీవుడ్ లో మాత్రం అడపాదడపా వెబ్ సిరీస్లలో మెరుస్తుంది. ఇక పలు నివేదికల ప్రకారం 2025 నాటికి ఈమె నికర ఆస్తులు దాదాపు రూ.101 కోట్లు. సమంత వార్షిక ఆదాయం ప్రకారం నెలకు రూ.8 కోట్లు వస్తున్నాయని.. ఇన్‌స్టాగ్రామ్ లో పెయిడ్ పార్టనర్ షిప్‌ఖు సమంత రూ.10 – 20 లక్షల వరకు అందుకుంటుందని.. ఇక టీవీ బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.3 నుంచి 5 కోట్ల రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమాల్లో నటించకపోయినా.. అమ్మడు ఆస్తులను భారీగానే కూడబెడుతుంది.