స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నేచురల్ నటనతో పాటు.. అందం, అభినయం, ట్రెడిషనల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగతంగాను అందరిని ఆకట్టుకుంటుంది. సినిమాలు ఎంచుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది. ఇక తనకు కంటెంట్ నచ్చకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అయినా కరీకండిగా నో చెప్పేసే ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలోనే తన సినిమాలతో లేడీ పవర్ స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
తాజాగా బాలీవుడ్ లోను బడ్డా పాన్ ఇండియన్ ప్రాజెక్టు రామాయణ్‌లో అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అంతా కాస్త రెమ్యునరేషన్ పెంచితే చాలు.. బోల్డ్ కంటెంట్ అయినా.. సినిమాల్లో సైతం గ్రీన్ సిగ్నల్ పిచ్చి నటిస్తూ ఉంటారు. కానీ.. సాయి పల్లవి మాత్రం దేనికి పూర్తి విరుద్ధం. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒకేలా ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే నటిస్తూ.. ఎక్స్పోజింగ్ చేయనంటూ కరకండిగా చెప్పేస్తుంది. ఇక ఈ అమ్మడు చివరిగా నటించిన అమరాన్, తండేల్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సాయి పల్లవి మరో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రాంపోతునేని హీరోగా తెరకెక్కుతున్న లవబుల్ లవ్ స్టోరీస్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. రియాలిటీ లవ్ స్టోరీ లో ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్.. అలాంటి ఏ ఎక్స్ప్రెషన్ అయినా కేవలం సాయి పల్లవి మాత్రమే పర్ఫెక్ట్ గా ఇవ్వగలుగుతుందని మేకర్స్ నమ్ముతున్నారట. ఈ క్రమంలోనే సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రానుందట.