ఈ ఫోటోలో మిమిక్రీ ఆర్టిస్ట్ టాలీవుడ్ క్రేజీ హీరో.. భార్య కూడా స్టార్ సెలబ్రిటీనే.. గుర్తుపట్టారా..?

తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారిలో చాలామంది మొదట ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. వివిధ రంగాలలో ప్లేస్ ను సంపాదించుకున్న తర్వాత.. మెల్లగా తమ టాలెంట్ చూపించి నటులుగా మారి సక్సెస్ అయిన వాళ్లే. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో చూపిస్తున్న మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒకరు. మొదట్లో మిమిక్రీ ఆర్టిస్టుగా.. తర్వాత కామెడియన్ గా.. ఇప్పుడు హీరోగాను మారి టాలీవుడ్ లో మంచి పాపులారిటి దక్కించుకున్నాడు. ఇంతకీ ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ లో కమెడియన్ గా చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించిన ఈ యాక్టర్.. తన మొదటి సినిమాతో అందరినీ కన్నీళ్లు పెట్టించాడు.

Rocking Rakesh (@jabardasthrakesh) • Instagram photos and videos

తన నటనతో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. అంతేకాదు తన మొదటి సినిమాకు ఆయనే స్వయంగా నిర్మాతగా ను పనిచేశాడు. దగ్గరుండి తనను తాను ప్రమోట్ చేసుకుంటూ.. తానే గోడలపై తన పోస్టర్లను కూడా అంటించుకున్నాడు. అంతేకాదు థియేటర్లోకి వెళ్లి తనే స్వయంగా టికెట్లను కూడా అమ్ముకున్నాడు. అలా అందరి నోళ్ళల్లో నాని తన సినిమాకు మంచి ప్రమోషన్స్ చేసుకున్నాడు. ఇంత చెప్పాను కదా.. ఇప్పుడైనా అతను ఎవరో అర్థమైందా.. సర్లేండి మేమే చెప్పేస్తాం. తనే జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్. ఈ పై ఫోటో అతన్ని టీనేజ్ పిక్. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రాకేష్.. ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోను షేర్ చేసుకున్నాడు.

KCR: 'కేసీఆర్'గా రాకింగ్ రాకేష్.. ఇదేం ట్విస్టురా అయ్యా? - NTV Telugu

అందులో రాళ్లపల్లి, శివారెడ్డి లాంటి స్టార్ సెలబ్రిటీతో తన చిన్నతనంలో దిగిన ఫోటోలను కూడా పంచుకున్నాడు. మా గురువుగారు రాళ్లపల్లి గారిని, డాక్టర్ నారాయణ్ గారిని తలుచుకుంటూ.. ప్రపంచ రంగస్థలం దినోత్సవానికి శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు. ఇక కొన్ని నెలల క్రితమే రాకేష్‌ నుంచి కేసీఆర్ సినిమా రిలీజైంది. తానే హీరోగా నటించిన ఈ సినిమాకు గరుడవేగ అంజి డైరెక్టర్గా వ్యవహరించారు. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో అనన్యకృష్ణ హీరోయిన్గా మెరిసింది. కేసీఆర్ టైటిల్ పెట్టడం.. భారీగా ప్రమోషన్లు నిర్వహించడం ఈ సినిమాపై హైప్‌ పెంచింది. దీంతో.. మంచి ఓపెనింగ్స్ లభించాయి. కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి.