చరణ్ మూవీ చూసి తన సినిమాలో సీన్ మార్చేసిన మహేష్.. కట్ చేస్తే రిజల్ట్ ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ ఎస్ఎస్ఎంబి 29 షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇక మహేష్ బాబు సినీ కెరీర్‌లో ఆయన ఎక్కువగా పని చేసిన డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక‌రు. వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు తెరకెక్కి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఖలేజా సినిమా.. భారీ అంచనాల నడుమ గ్రాండ్ లెవెల్‌లో రిలీజై ఫ్యాన్స్‌లో డిసప్పాయింట్మెంట్ను మిగిల్చింది. కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా.. బుల్లితెరపై మాత్రం సినిమాకు మంచి ఆదరణ దక్కింది.

Mahesh Talks About His Beedi Scenes In 'Guntur Karam' & Future! | Mahesh  Talks About His Beedi Scenes In 'Guntur Karam' & Future!

అయితే మహేష్ బాబు ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఖ‌లేజాకు సంబంధించిన షాకింగ్ విషయాన్ని రివీల్‌ చేశాడు. చరణ్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ప్రభావం ఖ‌లేజాపై పడింది అంటూ వివరించాడు. ఆ మూవీ మరేదోకాదు.. ఆల్ టైం ఇండస్ట్రియల్ హిట్ మగధీర అని.. మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్‌ ఫస్ట్ కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ.. ఆయన తర్వాత గుర్రం పేట్‌రైట్స్ మీవే కదా.. కానీ కాలేజ సినిమాలో ఇంట్రడక్షన్ ఫైట్ లో గుర్రంపై రాకుండా బైక్ పై ఎందుకు వచ్చారు.. ఫ్యాన్స్‌లో అది కాస్త డిసప్పాయింట్ చేసిందంటూ యాంకర్ ప్రశ్నించింది. దీంతో మహేష్ బాబు రియాక్ట్ అవుతూ.. నిజాయితీగా సమాధానం చెప్పాడు.

Charan Horse Ride for Sure! | cinejosh.com

ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ పర్మిషన్‌తో అంతా చెప్పేస్తున్నాను సార్ అంటూ.. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. నిజానికి గుర్రాలతో ఒక మంచి సీన్ డిజైన్ చేశాం. హీరో ఫైట్ పూర్తయిన వెంటనే వాటర్ తీసుకుని గుర్రంపై జంప్‌ చేసి వెళ్లిపోతాడు. ఆ సీన్ లో గుర్రాలతో చేజ్‌ కూడా ఉంటుంది. కానీ.. అప్పుడే మగధీర సినిమా రిలీజ్ అయింది అంటూ మహేష్ బాబు చెప్తుండ‌గా.. త్రివిక్రమ్ జోక్యం చేసుకుని వెంటనే గుర్రం పేటెంట్స్ మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు. మహేష్ మాట్లాడుతూ మగధీర అన్‌ బిలీవబుల్‌ మూవీ. బ్లాక్ బస్టర్ సక్సెస్.

Hd Frames from one of my fav films of @urstrulymahesh #Khaleja 💖✨💫  #Trivikram Magic💝💥 #MaheshBabu #SSMB28 #SSMB29 #anushkashetty #superstar  #SSMB #Prince

అది అందరం ఒప్పుకోవాల్సిందే. ఈ మూవీలో.. గుర్రాల సీన్‌ అద్భుతంగా ఉంది. నేను వెంటనే త్రివిక్రమ్ గారికి కాల్ చేసి.. ఇప్పుడు మనం కూడా గుర్రాల సన్నివేశం చేస్తే బాగోదు. దాన్ని మార్చేద్దాం అని చెప్పి.. వెంటనే ఏం చేద్దామని ఆలోచించడం మొదలు పెట్టాం. సార్ నేను గుర్రంపై జంప్ చేయడానికి ట్రై చేసి కింద పడిపోతా.. గుర్రం వెళ్లిపోతుంది. అప్పుడు హీరోకి ఇసుకలో బైక్ హ్యాండిల్ కనిపిస్తుంది. ఆ బైక్ తో హీరో పారిపోతాడు అని చెప్పా. అది త్రివిక్రమ్ గారికి బాగా నచ్చేసిందట అంటూ మహేష్ వివరించాడు. వెంటనే అప్పటికప్పుడు ఒక కొత్త బైక్ ని కొని దానిని పాత దానిలా మార్చేసాం అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు.