సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సౌత్ స్టార్ హీరోయిన్.. పెళ్లిపై హింట్ కుడా ఇచ్చింది..!

ఇండస్ట్రీ ఏదైనా సెలబ్రిటీలు రాణిస్తున్న వారు ఎవరైనా వారి పర్సనల్ విషయాలను ఎంత గోప్యంగా ఉంచుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రేమ, పెళ్లి విషయాలను కూడా త్వరగా బయటకు రివీల్ చేసేందుకు ఇష్టపడరు. గోప్యంగానే ఆ పనులను పూర్తి చేయాలని భావిస్తూ ఉంటారు. అలా తాజాగా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ స్టార్ హీరోయిన్ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు త్రిష. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా దోచుకుపోతున్న ఈ అమ్మడు.. నాలుగు పదుల వయసు దాటిన ఇప్పటికీ అదే అందం, అభినయంతో.. కుర్ర హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తుంది.

ఇక సినిమాలు తప్పితే ఇతర విషయాలపై పెద్దగా ఆసక్తి చూపదు త్రిష. అయినా ఈ అమ్మడికి సంబంధించిన ఏదో ఒక రూమర్ నెటింట‌ వైరల్ అవుతునే ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి త్రిష పెళ్లి పీటలు ఎక్కనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కారణం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోస్. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష.. తాజాగా తన ఇన్స్టా వేదికగా ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేసుకుంది. అందులో అమ్మే ఆకుపచ్చ రంగు చీరలో.. తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయంగా మెరిసింది.

ఇక ఈ శారీ కలర్‌కు మ్యాచింగ్.. మెడలో నెక్లెస్, చేతికి ఉంగరం ధరించి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ప్రేమ ఎల్లప్పుడు గెలుస్తుంది అనే క్యాప్షన్ ట్యాగ్ చేసింది. త్రిష షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో కొద్ది క్షణాల్లోనే తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే త్రిష ఏం చెబుతుంది.. ఆమె ప్రేమ‌లో ఉందా.. అనే సందేహం అందరిలోనూ మొదలైయాయ్యి. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ.. త్రిష ముఖంలో పెళ్లి కళ వచ్చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఫోటో వెనుక ప‌ర‌మార్ధం ఏంటో.. త్రిష క్లారిటీ ఇవ్వాల్సిందే.