ఇండియన్ బిగ్గెస్ట్ న్యూస్ నెట్వర్క్ టీవీ9 తాజాగా నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే.. సమ్మిట్‌కు ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పెషల్ గెస్ట్‌గా హాజరైన సందడి చేశారు. ప్రధాని మోడీకి మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు ఘన స్వాగతం పలుకుతూ.. సాలవాలతో సత్కరించాడు. ఈ క్రమంలోనే మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు, ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
ప్రధాని మోడీ:
ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ప్రపంచమంతా నేడు భారత్ వైపు ఉందని.. ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశ పౌరుడు ఒక క్యూరియాసిటీతో భారత్ వైపు చూస్తున్నాడు అంటూ వెల్లడించారు. ఇందులో భాగంగా మోడీ సమకాలీన రాజకీయాలతో పాటు.. నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలను కూడా ప్రస్తావిస్తూ ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు. ఇండియన్ థింకింగ్ గురించి మొత్తం ప్రపంచం ఆసక్తిగా చూస్తోందంటూ వెల్లడించారు. గతాన్ని, ప్రస్తుతాన్ని పోల్చుతూ అనేక అంశాలను ప్రధాని ఉదాహరణలతో వివరించారు. ఇక ఈ వాట్ ఇండియా థింక్స్ టుడే ఒక సరికొత్త, అద్భుతమైన ఈవెంట్ అని.. ఇతర ఛానళ్లకు కూడా ఎంతో మోటివేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం ఉందంటూ మోడీ ప్రశంసలు కురిపించారు. ఈ సరికొత్త కార్యక్రమం నిర్వహిస్తున్న టీవీ9 నెట్వర్క్‌ను ప్రధాని మోడీ అభినందించారు.
మై హోమ్ గ్రూప్స్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు:
ఇక మై హోమ్ గ్రూప్స్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు ఈ సమ్మిట్ లో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాలనలో జరిగిన ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గురించి చెప్పుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం.. రాబోయే రెండు ఆర్ధిక సంవత్సరాలలో భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న.. పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందంటూ వివరించారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక ఇబ్బందులతో భారత్ వైపే చూస్తుందంటూ పేర్కొన్నారు. పీఎం గతి శక్తి,, స్టార్ట్ అప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు , తయారీ, డిజిటల్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లాంటి వాటిలో మార్పులకు ఇది దారితీస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. డిజిటల్ ఇండియా విధానంలో దేశం చూపిస్తున్న చొరవ.. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని వివరించాడు. ప్రైమ్ మినిస్టర్ మోడీ.. న్యాకత్వంలో.. భారత్ డెవలప్మెంట్‌లో కొత్త అధ్యయనం లిఖించబడిందంటూ చెప్పుకొచ్చాడు. డిజిటల్ ఇండియా విజన్.. ఇండియన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్‌కు సరికొత్త ఇన్స్పిరేషన్ అంటూ వివరించారు. మోడీ న్యాయకత్వంలో ఇండియా ఒక మార్గదర్శ పాత్రను పోషిస్తుందని.. 1.45 బిలియన్లు ఇండియన్స్ ఆకాంక్షలకు బలమైన దిశా నిర్దేశం చేయడం.. ప్రపంచ అభివృద్ధికి భారత ప్రధాన మూలంగా మారడం.. నన్ను ఎంతగానో మోటివేట్ చేసిందని చెప్పుకొచ్చారు.