సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఓ హీరో కోసం కథ రాయడం.. ఆ హీరో కథను రిజెక్ట్ చేయడంతో మరో హీరోతో సినిమాని తెరకెక్కించి సక్సెస్ అందుకోవడం చాలా కామన్. అయితే.. కొన్ని సందర్భాల్లో హీరోలు తమకు కథ నచ్చిన హిట్ అవుతుంది అని తెలిసిన.. టైం అడ్జస్ట్ చేయలేక అలాంటి కథలను వదులుకుంటున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలా రకరకాల కారణాలతో ఈ సినిమాలు రిజెక్ట్ చేసిన వారిలో మహేష్ కూడా ఒకరు. తన కెరీర్లో కొన్ని కథలు ఆయనకు బాగా నచ్చినా.. హీట్ అవుతాయని నమ్మకున్నా.. కేవలం డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకున్నారట.
ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్లో అయితే మహేష్ ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ అయ్యాడు. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సుక్కుమార్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమైన తర్వాత తన కెరీర్‌ని యూటర్న్ తిప్పిన సినిమా ఏదైనా ఉందంటే అది ఆర్య. ఈ సినిమాలో మొదట హీరోగా మహేష్ బాబుని భావించారట. ఇక అది వన్ సైడ్ లవర్ రోల్ అని తెలియడంతో ఆ సినిమాను వదులుకున్నాడు మహేష్. ఆ సినిమా ఎలాంటి సూపర్ డూపర్ సక్సెస్ ఎందుకుందో తెలిసిందే. బన్నీ కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక రామ్ చరణ్ కెరీర్ యుటర్న్ తిప్పిన రంగస్థలం సినిమాలో కూడా మొదట మహేష్ బాబునే హీరోగా అనుకున్నారట.
మహేష్ ఈ సినిమాల్లో చెవిటి క్యారెక్టర్ అని తెలియడంతో.. ఆ సాహసం చేయలేక ఫ్యాన్స్ అసలు యాక్సెప్ట్ చేస్తారో.. లేదో.. అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడట. ఈ సినిమా చరణ్ తో పాటు సుకుమార్ కు కూడా మరింత మార్కెట్ ను పెంచింది. ఇక అసలు సిసలైన మూడో బ్లాక్ బస్టర్ పుష్ప. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాతో బన్నీ ఎలాంటి సంచలనం సృష్టించాడో.. ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడో చూస్తూనే ఉన్నాం. అయితే మొదట ఈ మాస్ కథ కోసం మహేష్ బాబును అనుకున్నారట. అయితే ఇంత మాస్ రోల్లో నటించడం నావల్ల కాదు.. ఆ రోల్ నాకు సెట్ కాదు అంటూ మహేష్ ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఇదే సినిమాకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు దక్కించుకొన్నాడు. రీసెంట్ పుష్ప 2 సాలిడ్ సక్సస్‌తో గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నాడు.