దివ్య భారతి ఆత్మ నన్ను వెంటాడింది.. నాగార్జున హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్..!

దివంగత స్టార్ హీరోయిన్ దివ్యభారతి టాలీవుడ్‌లో నటించింది అతి తక్కువ సినిమాలైనా.. ఆడియన్స్‌లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడుకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంటుందని అంతా భావించారు. ఇక కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో అనుమానాస్ప‌ద‌ స్థితిలో ఈమె మృతి చెందింది. తర్వాత ఆమెతో కలిసి నటించిన సహ నటులు అంతా ఆమె గురించి తలుచుకుని ఎమోషనలైన‌ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే దివ్యభారతి కోస్టర్ అయిన ఆయేషా ఝుల్కా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దివ్యభారతి కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.

R T Chawla ( Core Bollywood Photographer ) - divya bharti ayesha jhulka film  rang | Facebook

దివ్యభారతికి తనకు మధ్య ఉన్న బాండింగ్‌ను వివరిస్తూ.. మేము రంగ్ షూటింగ్లో ఉండగా ఈ సంఘటన నెలకొందని.. నేను ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆ సినిమాలో ఆమె నాకు చెల్లిగా నటించింది.. ఇద్దరం అప్పట్లో చాలా క్లోజ్. ఒక ఫ్రెండ్ కు మించి ఎక్కువగా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది. ఇద్దరూ వేరు వేరు సెట్లలో చేస్తున్నప్పుడు కూడా.. ఆమె నా దగ్గరికి వచ్చి నాతో కబుర్లు చెబుతూ ఉండేది అంటూ అయేషా చెప్పుకొచ్చింది. ఇక 1993లో దివ్యభారతి ఆయేషా కలిసి నటించిన రొమాంటిక్ మూవీ రంగ్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అయితే సినిమా విడుదలకు ముందే దివ్య భారతి మరణం చెందారు.

मेरी बहन ही मेरी सौतन बनेगी : दिव्या भारती ज़बरदस्त अंतिम सीन | Divya  Bharti | Ayesha Jhulka | Climax

సినిమా స్క్రీనింగ్ టైంలో ఆమెతో అనుబంధాన్ని తలుచుకుంటూ చాలా రోజులు నిద్రలేని రాతలు గడిపానని.. ఈ దురదృష్టకర సంఘటన నన్ను ఎప్పుడు బాధ పెడుతూనే ఉండేదని.. ఇక ఈ సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా తానే గుర్తుకు వచ్చి నేను బోరున ఏడ్చేసేదాన్ని.. దీంతో డబ్బింగ్ వాయిదా పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. మేము ఫిలిం సిటీ లో ఈ సినిమా రివ్యూ వేసినప్పుడు దివ్య తెరపై కనిపించిన క్షణంలో స్క్రీన్ నాపై ఒక్కసారిగా పడిపోయినట్లు అనిపించేది.. దివ్య ఉన్నట్లు ఓ ఫీలింగ్ కలిగేది.. చాలా బాధ అనుభవించా. ఇక ఆ రోజు రాత్రి నేను చాలా సేపు నిద్ర కూడా పోలేకపోయా అంటూ అయేషా జల్క చెప్పుకొచ్చింది.

Neti Siddhartha | Full Length Telugu Movie | Nagarjuna | Shobana | Ayesha  Jhulka

దివ్యభారతి మరణం తర్వాత కూడా నాతోనే ఉందని ఆమె వివరించింది. ఇక ఈ అమ్మ‌డు మొదట బాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమై ఎంతమంది స్టార్ హీరోలతో నటించి ఆకట్టుకుంది. మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్లో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన అయేషా.. 60 కి పైగా సినిమాల్లో మెరిసింది. ఇక తెలుగులోనే అక్కినేని నాగార్జున స‌ర‌సన నేటి సిద్ధార్థ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తన గ్లామర్ తో తెలుగు ఆడియన్స్‌ను మెప్పించింది. ఆమె లిప్ లాక్ సీన్స్ మూవీకి హైలెట్.