అలాంటి సర్జరీకి సిద్ధమవుతున్న కాజల్ అగర్వాల్.. నిరాశలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

తెలుగు స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో, సీనియర్ హీరో అని తేడా లేకుండా దాదాపు అందరితోను నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కుర్రాళ్ళ‌లో విపరీతమైన క్రేజ్ ను ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్చులుని ప్రేమించే వివాహం చేసుకుంది. తర్వాత బాబు పుట్టడంతో ఇండస్ట్రీ కు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. రీఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ లోను అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది.

Kajal Aggarwal with her Family #KajalAgarwal #KajalAggarwal

కాగా ఇటీవ‌ల‌ ఈ అమ్మడు రెండోసారి ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై కాజల్ రియాక్ట్ కాకపోవడంతో.. అదంత ఫేక్ అని తేలిపోయింది. ఇక మరోసారి కాజల్ అగర్వాల్ కు సంబంధించిన న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ న్యూస్ వైరల్ కావడంతో.. కాజల్ ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పలు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమవుతుందట.

Kajal Aggarwal Biography

అది కూడా తన పాదాలకు సర్జరీ చేయించుకోనుందని.. మొదటి నుంచి తన పాదంలో చిన్న ప్రాబ్లం ఉందని.. అదే పెరిగి పెద్దదైపోతుందని మరింతగా సమస్య తీవ్రత పెరిగింద‌ట‌. ఇదే కొన‌సాగితే ఫ్యూచర్లో నడవలేని స్థాయికి వెళ్ళిపోతుందట. ఈ క్రమంలోని నొప్పిని తట్టుకోలేక.. డాక్టర్ సజెషన్ విన్న వెంటనే.. సర్జరీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫారిన్ కంట్రీ లో ఈ సర్జరీ చేయించుకోనుందట కాజ‌ల్‌. ఈ వార్తల్లో వాస్తవం ఏంటో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కాజల్‌కు ఇలాంటి సమస్య ఉండడం నిజంగానే బాధాకరం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.