టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న భాటియా.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజె సంపాదించుకుందో తెలిసిందే. సౌత్ , నార్త్ అని తేడా లేకుండా దాదాపు పాన్ ఇండియా లెవెల్‌లో అన్ని భాషల్లోనూ తన నటనతో సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అందచందాలతో పాటు.. నటనతోను ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో పలు ఐటెం సాంగ్స్, బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటించి హైలెట్గా మారింది. అంతేకాదు సినిమాలతో పాటు వ్యక్తిగత లైఫ్ లోను ఎప్పటికప్పుడు తమన్నా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈ అమ్మడు డేటింగ్ లో ఉందంటూ గతంలో వార్తలు వినిపించాయి.
తర్వాత వీరిద్దరూ అఫీషియల్ గా అది నిజమేనని తెల్చేశారు. ఈ క్రమంలోని ఇద్దరు కలిసి చాలా ఈవెంట్లలో, రెస్టారెంట్లలో, సినిమాల ప్రీమియర్ షోలలో, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులలో చట్టపట్టాలేసుకుని తిరుగుతూ తెగ పాపులర్ అయ్యారు. అయితే తాజాగా వీరు ప్రేమ బంధానికి ఎండ్ కార్డ్ పడిందని.. వీళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటిసారి విజయవర్మ.. తమన్నతో బ్రేకప్ వార్తలపై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. స్ట్రైట్ క్లారిటీ ఇవ్వకుండా.. బహిరంగంగా కొన్ని కోట్స్ చెప్పి వైరల్‌గా మారాడు.
ఒక రిలేషన్షిప్ అనేది ఐస్క్రీమ్ మాదిరి. దాన్ని ఎప్పటికప్పుడు ఆస్వాదించాలి. దాని ప్రతిఘట్టాని అనుభవించాలి. అలానే ప్రేమలో ఆనందమే కాదు.. బాధ, చిరాకు, కోపం కూడా ఉంటాయి. ఇవన్నీటిని స్వీకరించడం నేర్చుకుంటేనే ఆ బాండింగ్ గట్టిగా కొనసాగుతుందంటూ ఆయన చెప్పవచ్చాడు. దీన్నిబట్టి విజయవర్మ.. పరోక్షంగా తమన్న గురించి.. తమన్న1తో ఆయన బ్రేకప్ కారణాన్ని గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పాడంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక గతంలో పలు ఈవెంట్లలో స్వయంగా విజయ్ వర్మ నే తమన్నా గురించి.. ఆమె ప్రేమ గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు పూర్తిగా టోనే మార్చేసాడు విజయ్ వర్మ.