కోలీవుడ్ సూపర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రజనీకాంత్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్న రజనీకాంత్.. స్టైల్, యాటిట్యూడ్‌తో రోజు రోజుకు ఫ్యాన్స్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఆయన సినీ కెరీర్ మొత్తంలో ఆయనకు భార్యగా, లవర్ గా, అమ్మగా నటించినా హీరోయిన్ ఒకరు ఉన్నారట. ఆమె ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి. 1976 లో వచ్చిన ముండ్రు ముదిచ్చు సినిమాలో రజనీకాంత్ కు శ్రీదేవి తల్లిగా మెరిసింది. కాగా.. ఈ సినిమా శ్రీదేవికి మొదటి సినిమా. తర్వాత వీళ్ళ కాంబినేషన్లో మొత్తం 22 సినిమాలు తెరకెక్కాయి. అందులో చాలా సినిమాల్లో ఈమె లవర్ గా.. మరికొన్ని సినిమాల్లో భార్యగా మెరిసి మెప్పించింది. అలా రజిని కెరీర్‌లోనే అమ్మగా, భార్యగా, లవర్ గా నటించిన మొట్టమొదటి అండ్.. చిట్టి చివర హీరోయిన్ శ్రీదేవి నే కావడం విశేషం.
ఇక ఏడుపదుల వయసులోనూ ఇప్పటికీ రాణిస్తున్న రజనీ.. ఇండియన్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్రేషన్ తీసుకుంటున్న హీరోలలోను టాప్ 5 లో ఉన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తన ఒక్క సినిమాకు రూ.180 కోట్ల వరకు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నాడట రజనీకాంత్. లొకేషన్ కనకరాజు డైరెక్షన్‌లో.. రజినీ కూలీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అక్కినేని కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం సర్వే గంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు టీం.