టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ ఎస్‌ఎస్ఎంబి 29 పై పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న సితార ఎస్‌ఎస్ఎంబి29ను ఉద్దేశిస్తూ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం సితార పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన సితార.. ఎస్ఎస్ఎంబి 29 మూవీలో నాన్న లుక్ అదిరిపోతుందని చెప్పకు వచ్చింది.
మీరు ఊహించిన దానిని మించే విధంగా ఈ సినిమా ఉండబోతుందని సితార కామెంట్ చేసింది. ఇంతకుమించి ఈ సినిమా గురించి నేనేం చెప్పలేనంటూ సితార చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇక సితార కామెంట్స్ సూపర్ స్టార్ మహేష్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. మహేష్, జక్కన కాంబోలో రూపొందుతున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో మెరువనున్నాడు.
ఇక ఈ సినిమాపై మంచి బజ్ నెలకొన్న క్రమంలో ఎన్ని భాషల్లో రిలీజ్ అవుతుందో వేచి చూడాలి. సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం ఈ సినిమా పై మంచి బజ్ నెలకొంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ నటించిన సినిమా ఏదనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. ఈ క్రమంలోనే మహేష్, రాజమౌళి కాంబో మూవీలో ట్విస్టులు కూడా వేరే లెవెల్ లో ఉంటాయట. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ1000 కోట్లని తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ జక్కన అఫీషియల్ గా ప్రకటించనున్నారట.